Wednesday, April 21, 2021

Latest Posts

ఒక్క పూట భోజనం లేక ఎన్నో రోజులు గడిపా

mohanbabu shocking comments on corona crisis

కరోనా మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ తో వలస కూలీలతో సహా వివిధ రంగాల కార్మికులు,పలు వృత్తిదారులు ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది దాతలు,వదాన్యులు తమకు తోచినమేరకు సాయం అందించి ఆదుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక వ్యాఖ్యలు చేసారు. ‘అవకాశం ఉన్నవాళ్లు.. ఆకలితో ఉన్నవాళ్లకు ఒక్కపూట భోజనం పెడితే మీకంటే గొప్పవాళ్లు ఎవ్వరూ లేరు.. అదే మీకు శ్రీరామరక్ష అవుతుం ది’అని ఆయన పేర్కొన్నారు.

ఈ ఆపత్కాల పరిస్థితుల్లో ఒక్క పూట భోజనం దొరకక ఎంతో మంది అల్లాడుతున్నా రని, నాకు ఆ దేవుడు కలుగజేసిన దానిలో నా వరకు నేను పదిమందికి భోజనం పెడుతున్నా నని మోహన్ బాబు పేర్కొన్నారు. ‘అయితే నేను గొప్పవాడిని అని చెప్పడం లేదు. ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకోమని చెబుతున్నాను’ అని పేర్కొంటూ మోహన్ బాబు తన ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు.

‘‘నేను నటుడిగా మద్రాస్‌లో ప్రయత్నిస్తున్న రోజుల్లో ఒక్క పూట భోజనం లేక ఎన్నో రోజులు గడిపా. ప్లేట్ మీల్స్ 80పైసలు అది లేక. అప్పుడు భగవంతుడిని ప్రార్థించా. దేవు డా.. నన్ను మంచి నటుడ్ని చెయ్. ఆ వచ్చిన డబ్బులో పది మందికి భోజనం పెట్టే అవకాశాన్ని కలుగజేయమని. ఆయన ఇచ్చాడు. ఈరోజున పదిమందికి భోజనం పెట్టగలుగుతున్నా. అంతమాత్రాన నేను గొప్పవాడిని కాను. అవకాశం ఉన్నవాళ్లు.. ఆకలితో ఉన్నవాళ్లకు ఒక్కపూట భోజనం పెడితే మీకంటే గొప్పవాళ్లు ఎవ్వరూ లేరు. అదే మీకు శ్రీరామరక్ష. ఆ పని చేయండి..’’ అని మోహన్ బాబు పేర్కొన్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss