Sunday, June 20, 2021

Latest Posts

సినిమా రిలీజ్ కాకుండానే 3 జాతీయ అవార్డులు

Mohanlal Film Won National Award

67వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా అవార్డులను ఒక సంవత్సరం పాటు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో మోహన్‌లాల్ నటించిన మరక్కార్‌ మళయాళ చిత్రానికి గాను ఉత్తమ ఫీచర్‌ ఫిల్మ్‌, స్పెషల్‌ ఎఫెక్ట్స్, కాస్ట్యూమ్స్ కేటగిరీల్లో అవార్డు లభించింది.

అయితే ఇలా అవార్డ్స్ రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం ఈ చిత్రం ఇంకా రిలీజ్‌ కాకపోవడమే. విడుదల కాకముందే అవార్డును ఎలా ప్రకటించారని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ చిత్రం గత ఏడాది మార్చి 26న విడుదలకావాల్సింది. కానీ లాక్‌ డౌన్‌ కారణంగా చిత్రం విడుదలకు నోచుకోలేదు. గత ఏడాదే సెన్సార్‌ బోర్డు నుంచి క్లియరెన్స్‌ రావడంతో ఈ చిత్రాన్ని 2020లో వచ్చిన చిత్రంగా జ్యూరీ పరిగణించింది.

అయితే ఈ ఏడాది మే 19న ఈ మూవీ రిలీజ్‌ కానుండడం విశేషం. చరిత్రలో మొదటి సారిగా రిలీజ్ కాకుండా జాతీయ పురస్కారం అందుకున్న చిత్రం ఇదే. కాగా, జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాలకు 4 అవార్డులు దక్కాయి.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss