Saturday, May 15, 2021

Latest Posts

బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ కానున్న మోనాల్ ఎందుకంటే?

బిగ్ బాస్ సీజన్ 4 అప్పుడే 11వ వారం చివరికి వచ్చేసింది. నామినేషన్ల ప్రక్రియ వస్తే చాలు కంటెస్టెంట్స్‌ ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణల దిగడం.. ఆ తర్వాత కాసేపటికి మళ్లీ మాములు అయిపోవడం అలవాటుగా మారిపోయింది. ఇదిలా ఉంటే వైల్డ్ కార్డు ఎంట్రీలతో కలిపి మొత్తం 19 మంది కంటెస్టెంట్స్‌ బిగ్ బాస్ 4 టైటిల్ కోసం పోటీ పడగా.. 11 వారం చివరికి హౌస్‌లో 8 మంది మాత్రమే మిగిలారు. వీరిలో ఈవారం ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు. కాగా, 11 వారం ఎలిమినేషన్‌కు అభిజిత్, హారిక, అరియానా, లాస్య, సొహైల్, మోనాల్‌లు నామినేట్ అయిన సంగతి తెలిసిందే.

వీరందరిలో అభిజిత్, సోహైల్, అరియానా సేఫ్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రేక్షకుల ఓటింగ్ పరంగా అభిజిత్ మళ్లీ టాప్ ప్లేస్‌ దక్కించుకున్నాడట. ఇక కొంత మంది అభిజిత్ ఫ్యాన్స్ హారిక కు వోట్లు వేసి సేవ్ చేస్తునట్టు సమాచారం. ఇక సొహైల్ అరియానా పెర్ఫార్మన్స్ పరంగా బాగా రాణిస్తుండడంతో వీళ్ళు కూడా సేఫ్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక లాస్య తన స్టార్ డమ్ తో ఓట్లను చేజిక్కించుకుంటుంది. ఈ విధంగా చూస్తే మోనల్ ఎలిమినేషన్ జోన్ లో పడ్డట్లే. తను టాస్క్స్ లో పోరాడకపోవడం అలానే భాష కూడా కొంత మందికి అర్ధం కాకపోవటంతో ఆమె ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.

ఇది కూడా చదవండి:

 

 

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss