Sunday, June 20, 2021

Latest Posts

అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఓటిటిలో విడుదల చేస్తారా!

Most Eligible Bachelor OTT Platform

కింగ్ నాగార్జున కొడుకు హీరో అఖిల్ అక్కినేని దురదృష్టం కొనసాగుతోంది. నిర్మాత బన్నీ వాస్ మరియు అల్లు అరవింద్ పై చాలా ఆశలు పెట్టుకున్న అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ పై సంతకం చేశారు. కానీ మొదటి నుండి, ఈ చిత్రం ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటుంది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మొదలయ్యి రెండేళ్లు పూర్తవుతోంది.

ఈ సినిమా కోసం టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజా హెగ్డే తీసుకున్నప్పటికీ, ఈ చిత్రం ఇప్పటి వరకు హైప్ సృష్టించడంలో విఫలమైంది. అయితే ఇక చేసేదేమీ లేక ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేస్తారు అని టాక్ నడుస్తుంది. అయితే అఖిల్ తండ్రి నాగార్జున ఈ సినిమా ఓటిటిలో విడుదల అవ్వడం పై స్పందించారు. తన కుమారుడి చిత్రం మొదట థియేటర్లలోకి రావాలని ఆశిస్తున్నాని తెలిపాడు. ఓటిటిలో రాదని చెప్పాడు, ఎందుకంటే అఖిల్‌కు కెరీర్‌లో ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా లేదు. కానీ ఈ చిత్రం పై భారీ నమ్మకం ఉందని చెప్పారు.

అల్లు అరవింద్ మరియు బన్నీ వాస్ కూడా థియేట్రికల్ విడుదలకు అనుకూలంగా ఉన్నారు. అయితే సినిమా థియేటర్ లో విడుదల కావాలంటే వారు మరో మూడు, నాలుగు నెలలు వేచి ఉండాలి. మరి ఏం జరుగుతుందో ఇంకొన్ని రోజులు వేచి చూస్తే గాని తెలియదు. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss