Mother Gave Birth to her 6 Children On Single Camp in MP:
మధ్య ప్రదేశ్ లో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలలోకి వెళితే మధ్య ప్రదేశ్ లో శివోపూర్ జిల్లాకు చెందిన గర్భవతి అయినా ఓ మహిళా పేరు మూర్తి మాల్(22). అక్కడి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం ప్రసవించారు. ఆమే ఈ ఒక్క కాన్పులోనే 6 బిడ్డలకు జన్మనిచ్చింది. ఆరుగురు బిడ్డలలో నలుగురు మగ పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. కాగా ఇద్దరు ఆడ పిల్లలు బరువు లేకపోవటంతో మరణించారు. మిగతా నలుగురు మగ పిల్లలు బరువు తక్కువ ఉన్నాను జన్మించి ఉన్నారు.
ఇది కూడా చదవండి:వృక్షాల నరికివేయడంలో 6 వ స్థానంలో ఆంధ్ర ప్రదేశ్
వీరి మొత్తం బరువు 3.65 కేజీలు ఉండటం గమనార్హం. వీరినందరిని ఇంటెన్సివ్ కేర్లో ఉంచి చికిత్స చేస్తున్నారు డాక్టర్లు. సహజంగా గర్భవతిగా ఉన్న స్త్రీలు పౌష్టిక ఆహరం తీసుకోకపోవడం వలన శిశువు యొక్క పెరుగుదల మీద ప్రభావం చూపి వీరి కాన్పు సమయాలలో ఇటువంటి సంఘటనలు జరుగుతాయి అని, అప్పుడప్పుడు తల్లి బిడ్డ ఇద్దరు బ్రతికే అవకాశం కూడా ఉండదని డాక్టర్లు తెలిపారు. ప్రభుత్వం గర్భిణీ స్తీల కోసం సంక్షేమ కార్య క్రమాలు చేపట్టి వీరికి తోడ్పాటు అందించాలని కోరుతున్నారు.