Wednesday, April 21, 2021

Latest Posts

మాతృమూర్తికి వందనం

అమ్మ అంటే ఓ అనుభూతి, అమ్మ అంటే ఓ అనుబంధం, అమ్మ అంటే ఓ ఆప్యాయత, అమ్మ అంటే ఓ ఆత్మీయత కనిపించే దేవత అమ్మ. తన కుటుంబం కోసం రేయనక, పగలనక శ్రమిస్తూ ఎల్లప్పుడు పిల్లల గురించే ఆలోచిస్తూ ఏ స్వార్ధం  లేకుండా, నిస్వార్థంగా పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతు వారి ఉన్నతి కోసం ఆలుపెరగకుండా శ్రమించేది తల్లి ఒక్కరే. అమ్మ ప్రేమకు ప్రతీరూపం, మమకారానికి నిలువెత్తు నిదర్శనం ఆ మాతృమూర్తి.

పిల్లల మనస్తత్వం అంచనా వేయడంలో అమ్మ తర్వాత ఎవరైనా. వారికి ఏ సమయంలో ఏం కావాలి? ఏం ఇవ్వాలి అన్ని ఆమెకు మాత్రమే తెలుసు. బిడ్డకు ఎటువంటి భాద కలిగిన, ఆకలి అవుతుందన్న విషయం అందరికన్నా ముందే అమ్మే పసిగడతుంది. తన బిడ్డ విజయాలు సాధించినప్పుడు ఆమే విజయం  సాధించి నంత ఆనంద పరవశురాలవుతుంది.  అలాంటి మాతృమూర్తుల కోసం ప్రతి సంవత్సరం మే రెండో ఆదివారం ‘మదర్స్ డే‘ నిర్వహిస్తున్నారు. ఆ శుభదినం ఈ రోజే… ఈ సందర్భాన్ని పుర్శకరించు కొని 99తెలుగు చానల్ తరుపున మాతృ మూర్తులందరికి వందనం.

ఇది కూడా చదవండి: ఏ‌పిలో లాక్ డౌన్ సడలింపు

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss