Monday, May 10, 2021

Latest Posts

చిరంజీవి బాటలో బ్లడ్ డొనేట్ చేసిన రాజా రవీంద్ర, హేమ

Movie acters gave blood at chiranjeevi blood bank :

మెగాస్టార్ తలపెట్టిన బ్లోడ్ డొనేషన్ కార్యక్రమాన్ని సినీ నటులు పాటిస్తున్నారు. ఈ దశలో నటులు హేమ, రాజా రవీంద్ర, ఉత్తేజ్ పాల్గొన్నారు.. రాజా రవీంద్ర ” అన్నయ్య చిరంజీవి చెప్పినట్లు బ్లోడ్ డొనేట్ చేయడం సంతోషంగా ఉందని, తలసేమియాతో బాధపడుతున్న వారికి ప్రతి నెల ప్లేటిలెట్స్ తగ్గకుండా రక్తం మార్చాల్సిన అవసరం ఉంటుంది, కాగా చిరంజీవి బ్లడ్ బ్యాంకు ద్వారా సేకరించిన రక్తాన్ని ఆర్థిక ఇబ్బంది ఉన్న పేషెంట్లకు మరియు పేదరికంలో ఉన్న పేషెంట్లకు ఉచితంగా రక్తాన్ని అందించడం జరుగుతుంది. ఒక హైద్రాబాద్ లోనే ఈ తలసామియా వ్యాధితో బాధపడుతున్న వారు ఉన్నారని, కాగా ఈ కరోనా మహమ్మారి వాళ్ళ ప్రజలు బ్లడ్ డొనేట్ చెయ్యడం తగ్గిందని, అందుకు అన్నయ చెప్పినట్లు బ్లడ్ డొనేట్ చెయ్యడం జరిగింది” అని అన్నారు.

ఒక 16 సంవత్సరాల క్రితం తన డెలివరీ టైంలో చాల రక్తం పోవడం వలన పరిస్థితి విషమంగా మారిందని, ఆ సమయంలో రాజా రవీంద్ర “చిరంజీవి బ్లడ్ బ్యాంకు” నుంచి నాకు రక్తాన్ని అందించారని, ఎలాంటి సమయంలో రక్తాన్ని ఇవ్వడం అందరి బాధ్యత అని, నటి హేమ తన కూతురుతో సహా వచ్చి బ్లడ్ డొనేట్ చేశారు. నటుడు ఉత్తేజ్ మాట్లాడుతూ, ఈ రోజు చాల సంతృప్తిగా ఉంది, అన్నయ అడుగు జాడలలో నడవం ఆనందంగా ఉంది అని, ఈ కష్ట సమయంలో బ్లడ్ అవసరమయ్యే వాళ్లకు అందివ్వడానికి బ్లడ్ డొనేట్ చెయ్యడం జరిగింది అని, అలాగే అన్నయ తలపెట్టిన #సీసీసీ కార్యక్రమాలు కూడా సినీ కార్మికులకు అండగా ఉందని చెప్పారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss