Saturday, February 27, 2021

Latest Posts

జూన్ నుంచి ప్రారంభం కానున్న సినిమా షూటింగులు

జూన్ మాసంలో సినిమా షూటింగులు ప్రారంభించు కోవచ్చని, పరిస్థితిని బట్టి, సినిమా థియేటర్ల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సినీ రంగ ప్రముఖులతో ఈ రోజు ప్రగతి భవన్‌లో  జరిగిన సమావేశం లో తెలిపారు.  లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగులు, ప్రీ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను దశల వారీగా పునరుద్ధరిస్తామని అయితే లాక్ డౌన్ నిబంధనలు, కోవిడ్ వ్యాప్తి నివారణ మార్గదర్శకాలు పాటిస్తూ షూటింగులు నిర్వహించేలా ఎవరికి వారు నియంత్రణ పాటించాల్సి ఉంటుందని ఈ సందర్బంగా సినీ రంగ ప్రముఖులకు తెలియజేశారు. అలాగే  సినిమా షూటింగులు ఎలా నిర్వహించుకోవాలనే విషయంలో విధి విధానాలు రూపొందించాలని సిఎం సంబంధిత అధికారులను ఆదేశించారు.

సినిమా పరిశ్రమపై ఆధారపడి లక్షలాది మంది జీవిస్తున్నందున ప్రొడక్షన్ పనులు, షూటింగుల కొనసాగింపు, థియేటర్లలో ప్రదర్శనలను దశలవారీగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని సిఎం అభిప్రాయపడ్డారు. తక్కువ మందితో, ఇన్ డోర్‌లో చేసే వీలున్న ప్రొడక్షన్ పనులు మొదట ప్రారంభించుకోవాలని సిఎం చెప్పారు.  ఈ సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, నిరంజన్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్‌లతోపాటు సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, డి.సురేష్ బాబు, అల్లు అరవింద్, ఎన్.శంకర్, రాజమౌళి, దిల్ రాజు, త్రివిక్రమ్ శ్రీనివాస్, జెమిని కిరణ్, రాధాకృష్ణ, కొరటాల శివ, సి.కల్యాణ్, మెహర్ రమేశ్, దాము తదితరులు పాల్గొన్నారు.ఈ సమావేశం అనతరం ట్విట్టర్ ద్వారా సినిమా పరిశ్రమ అందరి తరుపున చిరంజీవి సి.ఎమ్ కే‌సి‌ఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

 

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss