Monday, January 18, 2021

Latest Posts

సినిమా టిక్కెట్టు ఇక పై 200

Movie Ticket Price Increased

సినిమా ప్రేక్షకుల గుండెల్లో మరోసారి గుదిబండ దిగింది. ఏదైనా భారీ చిత్రం విడుదలకు సిద్ధమైనపుడు.. థియేటర్ యాజమాన్యం టికెట్ల రేట్లు పెంచుకోవడం జరుగుతుంటుంది. కానీ ఈసారి మాత్రం ఏ కారణం లేకుండానే టికెట్ రేటుని పెంచేసింది.

సాధారణంగా ప్రభుత్వాలకు విన్నవించో లేదంటే కోర్టులకు విజ్ఞప్తి చేసో టికెట్ల రేట్లు పెంచుకోవడం జరుగుతుంటుంది. కానీ ఈ సారి అవేమీ లేకుండానే సంక్రాంతి కానుకగా విడుదలైన ‘క్రాక్’ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో టికెట్ల రేట్లు భారీగా పెంచేశారు. సింగిల్ స్క్రీన్లలో రూ.100గా ఉన్న టికెట్ రేటును రూ.150కి పెంచేయగా.. మల్టీప్లెక్సుల్లో రూ.150ని 200 చేశారు. దీనితో సంక్రాంతికి వస్తున్న సినిమాలను ఎంజాయ్ చేద్దామనుకున్న ప్రేక్షకుల గుండెల్లో రాయి పడింది.

అయితే ఇప్పుడు థియేటర్లు 50 పర్సంట్ ఆక్యుపెన్సీతో నడుస్తున్న నేపథ్యంలో సినిమా రేటుని పెంచి డిస్ట్రిబ్యూటర్ల భారం తగ్గొచ్చు అని ఒకవేళ పెంచినా తరువాత 100 పర్సంట్ ఆక్యుపెన్సీ అయినప్పుడు రేట్లను  తగ్గిస్తారా అనేది సగటు ప్రేక్షకుడి ప్రశ్న.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss