Sunday, January 17, 2021

Latest Posts

కరోనా ఎఫెక్ట్ : హోం క్వారంటైన్‌లో సినీనటి, తృణమూల్ ఎంపీ

MP Mimi Chakraborty join home Quarantine due to corona effect:

లండన్ నుంచి స్వదేశానికి తిరిగివచ్చిన ప్రముఖ సినీనటి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యురాలు మిమీ చక్రవర్తి కరోనా భయంతో 14రోజులపాటు హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. ప్రముఖ సినీనటి కూడా అయిన మిమీ చక్రవర్తి ఓ సినిమా చిత్రీకరణ కోసం సినీ నిర్మాణ సంస్థ సిబ్బందితో కలిసి లండన్ వెళ్లి, సినిమా షూటింగ్ అనంతరం మిమీ చక్రవర్తి బుధవారం తిరిగి లండన్ నుంచి కోల్‌కతాకు వచ్చింది.

మిమీ చక్రవర్తికి కొవిడ్-19 సోకకపోయినా, ముందు జాగ్రత్తచర్యగా ఆమె 14 రోజులపాటు హోం క్వారంటైన్‌లోకి వెళ్లారని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రెస్ సెక్రటరీ అనీర్బన్ భట్టాచార్య చెప్పారు.కరోనా వైరస్ ప్రబలిన దేశాల నుంచి స్వదేశానికి వస్తున్న వారంతా 14రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సినీనటి అయిన ఎంపీ మిమీ చక్రవర్తి హోంక్వారంటైన్‌లోకి వెళ్లారు.

కాగా సౌదీ అరేబియా దేశ పర్యటన నుంచి స్వదేశానికి తిరిగివచ్చిన కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ సురేష్ ప్రభుకు జరిపిన పరీక్షల్లో కరోనా వైరస్ నెగిటివ్ అని వచ్చినా ముందుజాగ్రత్త చర్యగా ఆయన హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. అలాగే కేరళ రాష్ట్రంలోని ఓ ఆసుపత్రిలో కరోనా వైరస్ పాజిటివ్ రోగులను పరిశీలించేందుకు వచ్చిన కేంద్రమంత్రి వి. మురళీ ధరన్ కూడా ఐసోలేషన్ గదిలో చేరారు. కేంద్రమంత్రితోపాటు ఉన్న ఓ డాక్టరుకు కరోనా పాజిటివ్ అని రిపోర్టు వచ్చిన దృష్ట్యా కేంద్రమంత్రి సెల్ఫ్ క్వారంటైన్ అయ్యారు

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss