సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘ఒక్కడు’ సినిమా నిన్నటితో 18 ఏళ్లు పూర్తి చేసుకుంది. అయితే ఈ చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటినీ బ్రేక్ చేసింది. దీనితో ఈ సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ మహేష్ అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ హంగామా చేస్తున్నారు. ఈ సందర్భంగా మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ కూడా ఈ విషయాన్ని సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది.
అయితే ఇక్కడే పెద్ద రభస జరిగింది. ఈమె సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మహేష్ సినిమాల్లో`ఒక్కడు` క్లాసిక్ అని.. తన ఆల్ టైమ్ ఫేవరెట్ అని నమృత పేర్కొన్నారు. అయితే ఇందులో ‘ఒక్కడు’ సినిమాకి పని చేసిన అందరి పేర్లనూ తన పోస్ట్ లో ప్రస్తావించిన నమ్రత.. ప్రొడ్యూసర్ ఎమ్.ఎస్ రాజు పేరును మాత్రం ప్రస్తావించలేదు. దీనితో సదరు డైరెక్టర్ తన అసంతృప్తి ని సోషల్ మీడియా ద్వారా వెళ్ళగక్కాడు.
అతను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ, ”పొరపాట్లు జరుగుతుంటాయి`ఒక్కడు` గురించి మాట్లాడుతూ నమ్రత గారు నా పేరును మర్చిపోయారు. అయితే ఆమెకు ఫేవరెట్ క్లాసిక్ అయినందుకు చాలా సంతోషపడుతున్నాను. గుడ్ లక్” అని ట్వీట్ చేశారు. దీనికి మహేష్ బాబు ని కూడా ట్యాగ్ చేశారు. ఈ ట్వీట్ వైరల్ కావడంతో నమత్ర చేసిన పొరపాటును గ్రహించి తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో ఎమ్.ఎస్ రాజు పేరును చేర్చింది.
ఇవి కూడా చదవండి:
-
కరెంట్ ఖర్చు కూడా రాలేదు విజయ్ మాస్టర్ కి