మోడి ప్రవేశపెట్టిన భారతదేశ 20 లక్షల కోట్ల భారత స్వీయ ఆధారిత ప్యాకేజ్ ఈ రోజు నిర్మలా సీతారామన్ విడుదల చేశారు. కాకపోతే ఈ ఆర్ధిక ప్యాకేజ్ లోని అంశాలను ఒక్కో రోజు ఒక్కొక్కటిగా విడదల చేయనున్నట్టు స్పష్టం చేశారు. అయితే ఈ రోజు విడుదల చేసిన ప్యాకేజ్ MSME లోన్లకు సంబంచింది.
అయితే, ఎంఎస్ఎంఈ వలన భారత దేశం ఎలా పురోగతి సాదిస్తుంది అంటే… ఎంఎస్ఎంఈ సంస్థలు స్టాక్ మార్కెట్ లో లిఫ్ట్ కావడానికి తోడ్పడుతుంది. ఎంఎస్ఎంఈ లకు ఆరు అంశాలలో ఆర్ధిక ప్యాకేజ్ తో ప్రయోజనం. చిన్న మధ్య తరహా పరిశ్రమల కోసం లోన్లను ఈ ఎంఎస్ఎంఈ సిస్టమ్ ద్వారా చేకూర్చడం జరుగుతుంది. కాగా ప్రభుత్వం దీనికి గాను 3 లక్షల కోట్లు విడుదల చేయనున్నట్టు తెలిపింది. కాగా రుణం తీసుకున్న లబ్ది దారులు ఈ రుణాలను నాలుగేళ్ల లోపు తిరిగి చెల్లించే సదుపాయం ఉంది. కాగా ఈ రుణాలు 12 ఏళ్ల మారిదొరియంతో ఇవ్వబడతాయి. ప్రస్తుతం 50 వేల కోట్లతో ఎంఎస్ఎంఈ నిధిని ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. కాగా ఈ రుణాలు తక్షణం భారత దేశంలో ఉత్పత్తులు మొదలుపెట్టడానికి అవసరమవుతాయి.
ఇది కూడా చదవండి: జీడీపీ అంటే ఏమిటి? అసలు మన దేశ జీడీపీని ఎలా పెంచవచ్చు