Mukesh Ambani Fined With 15 Crore Rupees
ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరైన ముకేశ్ అంబానీకి జరిమానా విధించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ పై సెబీ(సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) రూ.15 కోట్ల జరిమానా విధించింది. ముకేశ్ అంబానీతో పాటు ఆయన సీఎమ్‌డీగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్, మరో రెండు సంస్థలపై కూడా సెబీ జరిమానాలు వడ్డించింది.
2007, నవంబర్‌లో రిలయన్స్ పెట్రోలియమ్ లిమిటెడ్(ఆర్పీఎల్) షేర్ల ట్రేడింగ్‌లో అవకతవకలకు సంబంధించిన కేసులో సెబీ జరిమానాలను విధించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.25 కోట్లు, నవీ ముంబై సెజ్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.20 కోట్లు, ముంబై సెజ్ లిమిటెడ్ రూ.10 కోట్ల మేర జరిమానాలు చెల్లించాలని సెబీ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ తాజా సెబీ ఆదేశాలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇంకా స్పందించలేదు.
ఆర్పీఎల్లో 4.1% వాటాను విక్రయించాలని 2007, మార్చిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్ణయించింది. అదే ఏడాది నవంబర్‌లో ఆర్పీఎల్ షేర్ల ట్రేడింగ్‌కు సంబంధించి నగదు, ఫ్యూచర్ సెగ్మెంట్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఆర్పీఎల్లో తన వాటా షేర్ల విక్రయానికి సంబంధించి లావాదేవీల ట్రేడింగ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అవకతవకలకు పాల్పడిందని సెబీ అడ్యూకేటింగ్ ఆఫీసర్ బి.జె. దిలిప్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి: