Kim Jong Un Is Died Says Chinese and Japan Media
36 సంవత్సరాల వయస్సు ఉన్న కిమ్జొంగ్.. ఈ నెల 11వ తేదీ నుంచి బాహ్య ప్రపంచానికి కనిపించకుండా వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నెల 15వ తేదీన ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు, కిమ్ తాత జయంత్యుత్సవాలకు కూడా ఆయన హాజరు కాలేదు. ఉత్తర కొరియా వ్యవస్థాపక దినోత్సవంగా జరుపుకొనే ఆ కార్యక్రమానికి కిమ్ హాజరు కాకపోవడం ఇదే ప్రదమం. దీనితో ఆయన ఆరోగ్యంపై వస్తున్న అనుమానాలకు మరింత బలం చేకురాయి.
ఇక చైనా ఆర్థిక రాజధాని హాంగ్కాంగ్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తోన్న హెచ్కేఎస్టీవీ హాంగ్కాంగ్ శాటిలైట్ టెలివిజన్ ఛానల్.. కిమ్జొంగ్ మరణించాడని వెల్లడించింది. ఉత్తర కొరియాకు చెందిన అత్యున్నత అధికార వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు శనివారం రాత్రి కిమ్ కన్నుమూశారని పేర్కొంది. ఇదే విషయాన్ని చైనా టాప్ సోషల్ మీడియా ప్లాట్ఫాం వీబోలో పోస్ట్ చేశారు. ఇక మరో చానల్ Earth News live కూడా కిమ్ శనివారం రాత్రి చనిపోయాడని వెల్లడించటం జరిగింది. ఉత్తర కొరియాకు చెందిన మీడియా ఒకటి కిమ్పై ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేయడం తో ఈ అనుమానాలను మరింత బలం చేకూరింది.
Kim Jong-un dead’ – multiple sources claim North Korean dictator died Saturday night.#KIMJONGUNDEAD #KimYoJong pic.twitter.com/Y55g9tspr2
— Earth News LIVE🌎🌍🌏 (@EarthNewsLIVE) April 26, 2020
ఇది కూడా చదవండి: నటుడు ఇర్ఫాన్ ఖాన్కు మాతృవియోగం
ఆధునిక నియంతగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ అంటే సహజంగానే ప్రపంచంలో చాలా మందికి కోపం. ఇలాంటి పరిస్థితుల్లో… ఆయనకు హార్ట్ సర్జరీ తర్వాత పరిస్థితి బాలేదని రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా చైనా డాక్టర్ల బృందం ఉత్తర కొరియా వెళ్లి… ఆయన ఆరోగ్యాన్ని సమీక్షించిందనే వార్తలు తెరపైకి రావటం, ఈ మొత్తం వ్యవహారంపై ఉత్తర కొరియా స్పందించకపోవడంతో… ట్విట్టర్ యూజర్లలో చాలా మంది కిమ్ జోంగ్ ఉన్ చనిపోయి ఉంటారని ఫిక్సైపోయి #KIMJONGUNDEAD, #North Korea టాగ్ తో ట్విటర్ వేదికగా తమదైన శైలిలో పోస్టు లు పెడుతున్నారు.
Trump at Kim Jong-Un's funeral #KIMJONGUNDEAD pic.twitter.com/fMhTAfyxUk
— Rhino❗️🇨🇲 (@rhinofficial_) April 26, 2020