Sunday, May 16, 2021

Latest Posts

కరోనా ఎఫెక్ట్ తో ముంబయ్ గప్ చుప్

Mumbai shutdown on corona virus effect:

మహమ్మారి కరోనా వైరస్ జనానికి కునుకు లేకుండా చేస్తోంది. ఢిల్లీ, కర్ణాటక, బీహార్, ఒడిశా రాష్ట్రాల లో ఇప్పటికే థియేటర్లు,స్కూల్స్ వంటివి మూసేస్తూ నిర్ణయం తీసుకోగా, ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ తో మహారాష్ట్ర ఉలిక్కిపడింది. కరోనా భయంతో మహారాష్ట్ర వాణిజ్య రాజధాని ముంబై సహా పలు నగరాలు ఇప్పుడు ‘షట్‌డౌన్ మోడ్’లోకి వెళ్లిపోయాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ముంబై, నవీ ముంబై, పూణె, పింప్రి చించ్వాడ్, నాగ్‌పూర్‌లలో సినిమాహాళ్లు, జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్‌ను మూసివేయాలని ప్రభుత్వం ప్రకటించింది.

దేశంలో ఇప్పుడు కరోనా బాధితుల సంఖ్య 80కి చేరగా, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5వేల మంది ఈ మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో వైరస్‌ మరింత విస్తరించకుండా చర్యలు చేపట్టిన మహారాష్ట్ర ప్రభుత్వం నేటి అర్ధరాత్రి నుంచి సినిమా హాళ్లు, జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్స్ మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. పూణె, పింప్రి చించ్వాడ్ ప్రాంతాల్లోని స్కూళ్లు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మూసే ఉంచుతారు.

ప్రస్తుతానికి మాల్స్ తెరిచి ఉండే అవకాశం ఉన్నా అవి కూడా మూతపడే అవకాశం ఉందని తెలుస్తోంది.గవర్నమెంట్ ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 ప్రకారం ఈ అత్యవసర చర్యల ఆదేశాలు అమల్లోకి వస్తాయని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రకటించారు. అలాగే, తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే అవకాశం కల్పించాలని ఆయా కంపెనీలను సీఎం కోరారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss