హైదరాబాద్‌లో ఓ యువకుడిని కత్తులు, హాకీ స్టిక్స్‌తో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హుడా కాలనీలో శ్రవణ్ అనే యువకుడి కార్పెంటర్‌గా పనిచేస్తూనే, స్థానికంగా ఉన్న ఓ వ్యాపారి వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత రెండు రోజులుగా శ్రవణ్, తన యజమాని నర్సింగ్ కుమారుడి వివాహం జరగడంతో ఆదివారం రిసెప్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆరోజు రాత్రి ఇంటికి కూడా రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. ఇంతలో ఓ యువకుడు వచ్చి, శ్రవణ్ రక్తపు మడుగులో పడి ఉన్నాడని కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి వెళ్ళి చూడగా శ్రవణ్ ఘటన స్థలంలోనే రక్తపు మడుగులో పడి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడని శ్రవణ్ సోదరి అంటోంది.
ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులకు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడని, కనీసం 108కు కాని, పోలీసులకు కాని, సమాచారం ఇవ్వమని అక్కడ ఉన్నవారిని అడిగినా ఎవరూ స్పందించలేదని శ్రవణ్ సోదరి వాపోయింది. శ్రవణ్‌కు స్థానికంగా ఎవరితో గొడవలు లేవని అతని తల్లి చెబుతోంది. కేసు నమోదు చేసుకున్నా పోలీసులు ఆరాతీయగా ఆసిఫ్‌నగర్ పీఎస్ లిమిట్స్‌లోని జిర్రాలోగల ధైభాగ్కు చెందిన గణేశ్, మరో యువకుడు ఇద్దరు కలిసి శ్రవణ్ ను హత్య చేసినట్లుగా పోలీసులకు తెలియడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించగా శ్రవణ్‌తో పాటు పనిచేసే మరో యువకుడు చింటుకు సంబంధించిన సమాచారం చెప్పకపోవడంతో అతని పై విచక్షణా రహితంగా దాడి చేసినట్లు గణేశ్, అతని అనుచరుడు తెలిపారు. దీంతో తీవ్ర గాయాల పాలైన శ్రవణ్ ఘటనా స్థలంలోనే చనిపోయినట్లుగా పోలీసులు నిర్దారించరు.
ఇది కూడా చదవండి: ఏపి లోని కరోనా కేసుల వివరాలు