Sunday, July 25, 2021

Latest Posts

ఆర్‌ఆర్‌ఆర్ లో భాగం కానున్న అనిరుధ్

Music Director Anirudh To Be Part Of RRR

క్రేజీ ప్రాజెక్ట్ ఆర్‌ఆర్‌ఆర్ దాదాపు పూర్తి కావొస్తుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టే యోచనలో ఉంది. ఇందులో భాగంగా ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ ఒక పాట పాడి, దాని కోసం డ్యాన్స్ చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాకి ఇది ప్రమోషనల్ సాంగ్ కానుంది. అయితే ఈ పాటను కీరవాణి కంపోజ్ చేయనున్నట్లు తెలుస్తుంది.

అనిరుధ్ మల్టీ టాలెంటెడ్ అన్న విషయం అందరికీ తెలిసిందే. అతను సంగీత దర్శకుడిగానే కాకుండా మంచి గాయకుడిగా మరియు డ్యాన్సర్ గా కూడా పేరుగాంచాడు. అంతకుముందు గ్యాంగ్ లీడర్ చిత్రానికి ఇలాంటిదే చేశాడు అనిరుధ్. ఆ చిత్రానికి ఒక ప్రమోషన్ పాటను స్వయంగా రూపొందించాడు. అజ్నాతవాసికి కూడా ఆయన ప్రమోషనల్ సాంగ్ చేశాడు. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం ఇప్పుడు ఈ పని చేయనున్నాడు. ఇప్పటికే ఆర్‌ఆర్‌ఆర్ బృందం సినిమా విడుదల తేదీని అక్టోబర్ 13గా ప్రకటించింది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss