Wednesday, January 20, 2021

Latest Posts

జగద్గిరిగుట్ట లో దారుణం.. కత్తులతో వెంటాడి చంపిన వైనం

హైదరాబాద్ జగద్గిరిగుట్టలో నగరంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. చాలా రోజులుగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉంటున్న హైదరాబాద్ ప్రాంతాల్లో ఇటువంటి సంఘటన జరగడం ఎంతో భయాందోళనలకు గురి చేస్తుంది. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్ పి కాలనీలో ఓ గుర్తు తెలియని యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పది మంది గుర్తుతెలియని వ్యక్తులు పరుగు పరుగున  బాధితుడిని తరుముతూ తమ దగ్గర ఉన్న కత్తులతో దాడి చేసి అత్యంత కిరాతకంగా నరికి చంపారు.

ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది, కాగా ఎంతో  భయాందోళనలకు గురి చేస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసునమోదు చేసుకున్న పోలీసులు.. మృతిచెందిన వ్యక్తి ఎవరు?, అతనిని ఎందుకు చంపారు?, పాత కక్ష్యలు లేక ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు దారి తీసిందా? అనే కోణంలో దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి మళ్ళీ ఇలాంటి దుశ్చర్యలు పునరావృతం కాకూడదని స్థానికులు పోలీసులను కోరుతున్నారు.

ఇది కూడా చదవండి: విశాఖ తరహాలో తెలంగాణలో కూడా గ్యాస్ లీక్

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss