Sunday, June 20, 2021

Latest Posts

అల్లు అర్జున్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యిన మైత్రి మూవీ మేకర్స్

Mythri Movie Makers Response

అల్లు అర్జున్ అభిమానుల కోపానికి గురి అయ్యింది మైత్రి మూవీ మేకర్స్. చాలా కాలం నుండి ప్రొడక్షన్ హౌస్ నుండి ఎటువంటి అప్డేట్స్ లేకపోవడంతో అభిమానుల ఆగ్రహానికి గురి అయ్యింది. అల్లు అర్జున్ పుట్టినరోజు ఏప్రిల్ 8న కావడంతో సమయం ఎక్కువ లేకపోవడంతో ‘పుష్ప’ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ పై విరుచుకుపడ్డారు అభిమానులు.

సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘పుష్ప’ కి సంబంధించి అప్‌డేట్‌ ఇవ్వాలని ట్విట్టర్ లో #WakeUpMythiMovieMakers అంటూ హ్యాష్‌ట్యాగ్‌ను ప్రారంభించారు. అల్లు అర్జున్ పుట్టినరోజున పుష్ప సినిమా టీజర్ కోసం బన్నీ డై-హార్డ్ అభిమానులు ఆశిస్తున్నారు. అయితే మైత్రీ మూవీ మేకర్స్ హ్యాష్‌ట్యాగ్‌పై స్పందిస్తూ ఏమి మాట్లాడకుండా మూడు ఎమోజీ స్మైల్స్‌తో స్పందించింది. ఈ స్మైలీస్ అర్ధం కాక అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. మరి ఈ సినిమా టీజర్ ను అల్లు అర్జున్ పుట్టిన రోజు నాడు రిలీజ్ చేస్తారా లేక ఒక పోస్టర్ తోనే సరిపెడతారా అని వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss