Monday, January 25, 2021

Latest Posts

మోడీ చర్యలు భేష్ అంటున్న చంద్రబాబు …….. 

N Chandrababu Naidu appreciated Prime Minister Narendra Modi:

మహమ్మారి కరోనా నేపథ్యంలో  లాక్‌డౌన్‌ కారణంగా దేశంలో ఎవరూ పస్తులు ఉండకూడదన్న ఉద్దేశంతో కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ ప్రధాని మోదీ ప్రభుత్వ మానవీయ ధోరణికి నిదర్శనమని మాజీ సీఎం చంద్రబాబు  కొనియాడారు. కరోనా వైరస్‌ కోవిడ్‌-19ను నియంత్రించడానికి ప్రధాని మోదీ చేస్తున్న యత్నాలను అభినందించారు. ఈ మేరకు ప్రధానికి  ఓ లేఖ రాశారు. వైర్‌సపై పోరాటంలో ప్రధానికి, ఆయన బృందానికి సంపూర్ణంగా మద్దతిస్తున్నట్లు ప్రకటించారు.

‘ఎంతో వైవిధ్యం, అధిక జనాభా కలిగిన దేశం కరోనా వైరస్‌ ముప్పు అంచున ఉంది. మీ సమర్థ నాయకత్వంలో ఈ విపత్తును జాతి సమర్థంగా ఎదుర్కొంటుందని విశ్వసిస్తున్నాం. లాక్‌డౌన్‌ అమలయ్యే కాలంలో దేశంలో ఏ ఒక్కరూ పస్తులు ఉండరాదనే ఉద్దేశంతో కేంద్రం చేపట్టిన చర్యలు, ప్రకటించిన ప్యాకేజీ ద్వారా జనాభాలో మూడింట రెండొంతుల మంది ప్రయోజనం పొందుతారు.  ఈ అల్లకల్లోల పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచేందుకు ప్యాకేజీని అందించేందుకు సమాయత్తం కావడం ప్రశంసనీయం”అని చంద్రబాబు పేర్కొన్నారు.

” మీ సమర్థ నాయకత్వం, మార్గదర్శకత్వంలో కోవిడ్‌-19 ముప్పు నుంచి దేశం త్వరితగతిన కోలుకోవడమే కాక, ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో సరైన స్థానాన్ని తిరిగి సాధించగలదనే విశ్వాసంలో మేమంతా ఉన్నాం. జాతీయ ఉపాధి హామీ పథకం కింద వేతనాల పెంపు, ఈపీఎఫ్‌ ద్వారా వ్యవస్థీకృత రంగంలోని కార్మికులు, స్వల్ప వేతన జీవులకు, సీనియర్‌ సిటిజన్స్‌ ప్రయోజనం చేకూర్చడం, ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌(హెల్త్‌ వర్కర్స్‌)కు రూ.50 లక్షల బీమా, రైతులకు ముందుగానే ఒక విడత పెట్టుబడి సాయం, పేద మహిళలకు ఎక్స్‌గ్రేషియా, ఉచిత గ్యాస్‌ సిలిండర్లు, డ్వాక్రా బృందాలకు అదనపు పరపతి సౌకర్యం కల్పించడం హర్షణీయం’ అని లేఖలో చంద్రబాబు అభినందించారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss