nadendla manohar comments on ysrcp government:
పీలో ప్రభుత్వ తీరుపై జనసేన మండిపడింది. ఆపార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి రాష్ట్రాభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం రివర్స్ చేసిందని విమర్శించారు. రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్టుతోపాటు చాలా ప్రాజెక్టులు అర్ధంతరంగా నిలిచిపోయాయని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానికి మద్దతు తెలిపి, అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డిలా మాటమార్చడం తమ నాయకుడికి చేతకాదన్నారు.
రాజధాని విషయంలో జనసేన పార్టీపై కొంతమంది కావాలనే దుష్ప్రచారం చేస్తున్నార న్నారని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మంత్రులు ప్రజలను గందరగోళానికి గురి చేయడం, రాత్రికి రాత్రి రహస్య జీవోలు జారీ చేయడం తప్ప పారదర్శక పాలన జరగడం లేదు. పెట్టుబడుదారుల్లో భయాందోళనలు సృష్టించి పెట్టుబడులు పెట్టాలన్న వాతావరణాన్నే కలుషితం చేశారు’అని ఆయన ధ్వజమెత్తారు. రాజధాని విషయంలో స్పష్టమైన స్టాండ్ తీసుకున్న ఏకైక పార్టీ జనసేన పార్టీనని చెప్పారు. ప్రజలు వైసీపీ పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలను ఇస్తే… ఇవాళ ఆ పార్టీ నాయకులు ధైర్యంగా మాట్లాడలేక పోతున్నారని ఆయన విచారం వ్యక్తంచేశారు.
‘మూడు రాజధానులపై సరైన ప్రణాళిక లేదు. ముఖ్యమంత్రి కార్యాలయం ఎక్కడుంటుంది?. సచివాలయం ఎక్కడుంటుంది?. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కార్యా లయాలు ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తారో చెప్పడం లేదు. ఆనాడు అమరావతి రైతులతో ప్రభుత్వమే ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం అనుసరించే రైతులు వారి భూములను త్యాగాలు చేశారు. రాజధాని 29 గ్రామాల సమస్య కాదు. 5 కోట్ల ఆంధ్రుల సమస్య’ అని మనోహర్ పేర్కొన్నారు. కాగా జనసేన పార్టీకి యువతే బలమన్నారు. పార్టీని యువతే తమ భుజస్కంధాలపై మోస్తోందన్నారు. వెనకబడ్డ ఉత్తరాంధ్రకు న్యాయం చేయాలన్న సంకల్పంతో యువతకు పవన్ కళ్యాణ్ టిక్కెట్లు ఇచ్చారని తెలిపారు.