కొన్ని సినిమాలు అనుకున్నట్టు చేయలేరు. ఒకరితో తీద్దామనుకుంటే మరొకరితో అవుతుంది. ఇందుకు రకరకాల కారణాలుంటాయి. ఈ సినిమా ఫలానా వాళ్ళ కాంబో లో తీయాలని ప్లాన్ చేసి,మరొకరితో తీసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే అలా తీసిన సినిమా హిట్ కొడితే,అయ్యో మేం చేయలేకపోయామే అని ఫీలయిపోతారు. ఇక ఆలిండియా లెవెల్లో ఈ మూవీ దుమ్మురేపితే ఇక ఆ బాధ వర్ణించలేనిది. నాగార్జునతో రెండు సినిమాలు తీసిన రామ్ గోపాల్ వర్మ మూడో మూవీకి ఏర్పాట్లు చేస్తున్న సమయం అది.
అప్పటికే ఆలిండియా లెవెల్లో నాగ్,వర్మలకు క్రేజ్ వచ్చేయడంతో రంగేలా మూవీని మల్టీస్టారర్ గా తీయాలని వర్మ ప్లాన్ చేసాడు. నాగార్జున, రజనీకాంత్ హీరోలుగా అనుకున్నారు. ఇక శ్రీదేవి హీరోయిన్. ముగ్గురూ ఒకే. నిర్మాతగా అశ్వినీదత్ కనెక్ట్ అయ్యాడు. అయితే బడ్జెట్ ఎక్కువైపోతుందని అశ్వినీ దత్ అనుకోవడం,దీనికి తోడు ఒకరికి డేట్స్ కుదిరితే మరొకరికి కుదరక పోవడంతో ఇబ్బంది వచ్చేసింది. దీంతో డేట్స్ కరెక్ట్ గా ఎడ్జెస్ట్ అయిన నాగ్, శ్రీదేవితో మూవీ చేయడానికి ఇంకో కథ రెడీ చేయమని దత్ సూచించాడు.
దీంతో అప్పటికే అనుకున్న మల్టీస్టారర్ కథ పక్కన పెట్టేసి, మరో కథతో నాగ్, శ్రీదేవి హీరోగా సినిమా స్టార్ట్ చేసేసారు. అశ్వినీదత్ నిర్మాతగా వర్మ డైరెక్షన్ లో వచ్చిన ఆ సినిమాయే గోవిందా గోవిందా. 1994లో విడుదలైన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కాగా ముందు అనుకున్న మల్టీస్టారర్ మూవీని హిందీలో 1995లో నాగ్ పాత్రలో అమీర్ ఖాన్,రజనీకాంత్ పాత్రలో జాకీ ష్రాఫ్ ,శ్రీదేవి పాత్రలో ఊర్మిళ ను పెట్టి వర్మ రంగీలా మూవీ తీసాడు. అది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. అదండీ కథ.