Sunday, June 13, 2021

Latest Posts

మళ్ళీ రాజకీయాల్లోకి రారన్న మెగా బ్రదర్ 

Naga Babu reveals Chiranjeevi’s decision about political entry

మహమ్మారిగా మారి  ప్రపంచాన్ని  వణికిస్తున్న   కరోనా వైరస్ తో విధించిన  లాక్‌డౌన్‌లో సెలబ్రిటీలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే ఈ సమయంలో వారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. తద్వారా తమ అభిమానులకు దగ్గరయ్యేందుకు అన్ని విధాలా సిద్ధం అయ్యారు. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా ద్వారా తనను వీడియో మెసేజ్ ద్వారా ప్రశ్నలు అడిగితే.. వాటికి లైవ్‌లో సమాధానం ఇస్తానంటూ.. అభిమానులకు, నెటిజన్లకు తెలిపారు.  ప్రశ్న అడిగిన వారిని కూడా ఈ వీడియో చూపించి.. ఆ తర్వాత తన సమాధానం ఇస్తానని నాగబాబు చెబుతూ,  ఈ కార్యక్రమానికి ‘మన ప్రయాణం’ అనే పేరు పెట్టారు. ఈ కార్యక్రమంలో ఒక నెటిజన్ చిరంజీవి జనసేనలోకి వస్తే చూడాలని ఉంది. అలాంటి ప్రతిపాదన ఛాన్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగారు.

నాగబాబు స్పందిస్తూ .. ‘‘ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ప్రజలకు సేవ చేద్దామనే మంచి ఉద్దేశ్యంతో అన్నయ్య చిరంజీవి రాజకీయాలలోకి వచ్చారు. అనేక కారణాల వల్ల ఆ పార్టీని కొనసాగించలేక కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఆ తర్వాత టూరిజం మినిస్టర్‌గా చేసినా. ఎక్కడో ఇండస్ట్రీకి దూరం అయ్యానే అనే బాధ, ప్రస్తుతం ఉన్న పొలిటికల్ సిస్టమ్ నచ్చకపోవడంతో, ఆయన ఇక రాజకీయాలు వద్దు అనుకుని, ఏదైనా కళామతల్లి ఒడిలోనే చేయగలం అని చెప్పి, రాజకీయాలు వదిలేసి,  తిరిగి సినిమాల్లోకి వచ్చేశారు. అందుకనే ఆయన మళ్లీ రాజకీయాలలోకి వెళ్లే అవకాశం లేదు. ఎందుకంటే ఒకసారి రాజకీయాలు వద్దని అనుకున్నాక, మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనే ఉండదనేది నా నమ్మకం. ఆయన అభిప్రాయం నాకు తెలియదు కానీ.. నా అభిప్రాయం మాత్రం అదే’అని స్పష్టంచేశారు.

అన్నయ్య జనసేనలోకి వస్తారా? అని అడుగుతున్నారు. వాస్తవానికి జనసేన మంచి ఐడియాలజీ ఉన్న పార్టీ. తమ్ముడు పవన్ కల్యాణ్ పెట్టిన పార్టీ. నేను కూడా అందులో యాక్టివ్‌గానే ఉన్నా. అసలు రాజకీయాలే వద్దనుకుని వెళ్లిపోయిన చిరంజీవిగారు జనసేనలోకి వచ్చే అవకాశం లేదు. సినిమాలే తనకు అన్నీ అనుకుని వచ్చేసిన ఆయన మళ్లీ రాజకీయాలలోకి రావాలనే ఆలోచన చేయడనే అనుకుంటున్నాను. ఎందుకంటే, ఒక్కసారి వద్దనుకున్నాక మళ్లీ రాజకీయాలలోకి రారనే నా నమ్మకం. అయితే భవిష్యత్ ఎలా ఉంటుందనేది ఇప్పుడెవరం చెప్పలేం.  నా వరకు నేను ఆయన రాడనే అనుకుంటున్నా. ఒకవేళ వస్తే.. జనసేనలోకి రావచ్చు. లేదంటే వేరే విధంగా అయినా ఆయన మూవ్ ఉండొచ్చు. నాకు తెలిసినంత వరకు మాత్రం ఆయన కళా రంగాన్ని వదిలి మాత్రం ఇక రాడని అనుకుంటున్నా’’ అని నాగబాబు చెప్పుకొచ్చారు

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss