Monday, October 25, 2021

Latest Posts

మెగా బ్రదర్ కు కరోనా పాజిటివ్

కరోనా వైరస్ ప్రస్తుతం ఎవర్నీ వదలడం లేదు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరికీ వైరస్ వచ్చేస్తుంది. ఇంటింటికి కరోనా అన్నట్లుంది ఇప్పుడు పరిస్థితి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఈ వైరస్ వ్యాప్తి అరికట్టలేకపోతున్నారు. ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో కూడా చాలా మంది కరోనా బారిన పడ్డారు. తెలుగు ఇండస్ట్రీలో కూడా బండ్ల గణేష్, రాజమౌళి, ఎస్పీ బాలసుబ్రమణ్యం సహా చాలా మంది ప్రముఖులు ఇప్పటికే కరోనాతో పోరాడి విజయం సాధించారు.

కాగా తాజాగా మెగా బ్రదర్ నాగబాబుకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. కరోనా లక్షణాలు కనిపించడంతో నాగబాబు టెస్ట్ చేయించుకున్నారు. అందులో పాజిటివ్ అని తేలడంతో ప్రస్తుతం నాగబాబు హోమ్ క్వారెంటైన్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. కరోనాను జయించి, ప్లాస్మా దానం చేస్తానని ఈ సందర్భంగా నాగబాబు ట్వీట్ చేశారు. తనను కలిసిన వాళ్లందరూ కూడా టెస్టులు చేయించుకోవాలని ఆయన సూచించినట్లు తెలుస్తుంది.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss