Thursday, May 13, 2021

Latest Posts

‘వెంకీమామ‌’పై నాగచైతన్య సంచలన వ్యాఖ్యలు …..

గడిచిన సంక్రాంతికి  విక్ట‌రీ వెంక‌టేశ్‌, వరుణ్ తేజ్ కాంబోలో వచ్చిన ఎఫ్ 2మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో కలెక్షన్స్ వర్షం కురిసింది. ఇక ఈ ఏడాది సంక్రాంతికి ముందే  వెంకీ, అక్కినేని నాగ‌చైత‌న్య కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం `వెంకీమామ‌` టాబోతోంది. డిసెంబ‌ర్ 13న సినిమా విడుద‌ల‌ చేయడానికి చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది.

ఈ సంద‌ర్భంగా ఖ‌మ్మంలో  జ‌రిగిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో నాగ చైతన్య మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. “`మ‌నం`, `వెంకీమామ‌` చిత్రాలు నా జీవితంలో మ‌ర‌చిపోల‌ని జ్ఞాప‌కాలు. కెమెరా వెనక ఓ మామ.. ముందు మరో మామ.. నన్నెంతో బాగా చూసుకున్నారు. రేపు విడుదలైన తర్వాత క్రెడిట్ అంతా వాళ్లదే. కూల్ డైరెక్టర్ బాబీకి థ్యాంక్స్”అని పేర్కొన్నాడు.

కొందరు కమర్షియల్ ఎలిమెంట్స్.. కొందరు కంటెంట్ పట్టుకుని సినిమా చేస్తార ని అయితే బాబీ రెండు కలిపి కొట్టాడని నాగచైతన్య అన్నాడు. ” హీరోయిన్స్ రాశీ, పాయల్ కూడా చాలా బాగా నటించారు. త‌మ‌న్ ప్రతీ ఏడాది ఫ్రెష్ సౌండ్‌తో వస్తున్నాడు. టెక్నికల్ టీం అంతా అద్భుతంగా పని చేశారు. ట్రైలర్ అంద‌రికీ న‌చ్చింది. సినిమాలో అల్లరి అల్లరిగా ఉంది కదా.. మామ అల్లుళ్లు అల్లరి మామూలుగా ఉండదు. మీరే చూసారుగా“ అని పేర్కొన్నాడు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss