25 ఏళ్ళ క్రితం మహేష్ భట్ దర్శకత్వంలో తెరకెక్కిన అందమైన చిత్రం క్రిమినల్. తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదలైన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు లభించాయి. తెలుగులో నాగార్జున, రమ్యకృష్ణ, మనీషా కోయిరాలా ముఖ్య పాత్రలు పోషించగా, ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించారు. కాగా ఈ చిత్రంలోని తెలుసా… మనసా… ఇది ఏనాటి అనుబంధమో అంటూ సాగే ఈ పాట హిందీ,తెలుగు వర్షెన్ని అనూప్ శంకర్ స్వయంగా పాడి సమాజానికి సేవ చేసే నిస్వార్థ హృదయాలకు అంకితమిస్తున్నట్టు పేర్కొన్నాడు.
ఈ విషయం తెలుసుకున్న నాగార్జున తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ఈ పాటను నిస్వార్ధ సేవ చేస్తున్న వారికి అంకితం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని..ఈ అందమైన పాట 25 ఏళ్లు పూర్తి చేసుకుంది అంటూ నాగ్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు.
Telusa Manasa Song Dedicated With selfless hearts who serve the society
ఇది కూడా చదవండి: ఇష్టమైన వారితో కలిసి ఉంటేనే కరోనాపై యుద్ధం చేయగలం – సోనూసూద్