Sunday, May 9, 2021

Latest Posts

మొదలయ్యిన నాగార్జున సాగర్ కౌంటింగ్ ఆధిక్యంలో కారు

Nagarjuna Sagar By – Election 2021

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల కౌంటింగ్ మొదలయ్యింది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత మొదటి రౌండ్‌లో కూడా టీఆర్ఎస్ ఆధిక్యం కొనసాగింది. తాజాాగా జరిగిన ఏడోవ రౌండ్ లెక్కింపు తర్వాత కూడా టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తం 6592 ఓట్ల మెజారిటీతో కారు జోరు కొనసాగుతోంది. టీఆర్‌ఎస్‌ తరపున నోముల భగత్ పోటీ చేశారు.

మొత్తం ఓట్లు 2,20,206 ఉండగా 86.1 శాతం ఓట్లు 189782 పోలయ్యాయి. మొత్తం 346 పోలింగ్‌ కేంద్రాలు ఉండడంతో 25 రౌండ్లలో లెక్కింపు పూర్తికానుంది. తొలి రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 4228 ఓట్లు, కాంగ్రెస్‌కు 2753 ఓట్లు వచ్చాయి. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో మొత్తం 41 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. టీఆర్‌ఎస్‌ నుంచి నోముల భగత్‌, కాంగ్రెస్‌ నుంచి జానారెడ్డి, బీజేపీ తరపున రవి నాయక్‌ మధ్య ప్రధాన పోటీ నడుస్తుంది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss