Sunday, June 20, 2021

Latest Posts

జాతీయ స్థాయిలో వెబ్ సిరీస్ లు చేయనున్న నాగార్జున

Nagarjuna To Do National Web Series

కోవిడ్ దెబ్బతో సినిమా ప్రపంచమే మారిపోతుంది. థియేటర్లకు వెళ్లవలసిన ప్రేక్షకులు ఓటీటీలను ఆదరిస్తున్నారు. కరోనా కారణంగా థియేటర్లను మూసి వేయడంతో ఓటీటీల హవా సాగుతోంది. తాజాగా విడుదల అయిన నాగార్జున `వైల్డ్ డాగ్` థియేటర్లలో ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు. దీనితో ఈ సినిమాని కొన్ని రోజులకే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయాల్సి వచ్చింది.

అయితే థియేటర్ అభిమానులని అంతగా ఆకట్టుకోలేని ఈ సినిమా ఇప్పుడు ఓటిటీ లో ఇరగదీస్తుంది. ఓటీటీ సినిమాల్లోనే ట్రెండింగ్ లో నిలిచింది. ఇది ట్రెండింగ్ లోకి రావడంతో మా సినిమా ఓటిటీ లో చూడాలని నాగార్జున కూడా ఫుల్ గా ప్రమోషన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఓటిటీ హిట్ తో నాగార్జున త్వరలోనే ఓటీటీలో మరో రెండు సినిమాలు చేయనున్నారు. దీనికి సంబందించి నాగార్జున ఇలా చెప్పారు,`నాకు రెండు జాతీయ స్థాయి వెబ్ సిరీస్ లలో అవకాశాలు వచ్చాయి. అవి రెండూ ఎగ్జయిట్ చేసేవే.. నేను కూడా ఆసక్తిగా వేచి చూస్తున్నాను` అని కింగ్ వెల్లడించారు. అయితే వాటి వివరాల్ని అంతకుమించి వెల్లడించలేదు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss