నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ పట్టణం ఈదులగూడ సర్కిల్ వద్ద బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తూ నలుగురు యువకులు పట్టుబడ్డారు.కానీ మత్తులో ఉన్న ఓ యువకుడు ఏకంగా పోలీసుల వాహనంలోనే పరారయ్యేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో రూరల్ సీఐ రమేష్ బాబు పోలీస్ వాహనం చోరికి గురైంది. పరారయ్యే క్రమంలో ఎదరుగా వస్తున్న వాహనాన్ని పోలీస్ వాహనం ఢీకొనడంతో కారు ముందు భాగం ధ్వంసమయ్యింది. అయితే చివరకి అతడిని వెంబడించిన పోలీసులు చివరకు ఆళ్లగడప టోల్ గేటు వద్ద వాహానాన్ని పట్టుకున్నారు. అందులో ఉన్న యువకుడిని అదుపులోకి తీసుకుని, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: