Sunday, June 20, 2021

Latest Posts

అఖండ కోసం బాలయ్య ఎంత తీసుకుంటున్నారంటే?

Nandamuri Balakrishna Remuneration

టాలీవుడ్ హీరోల రెమ్యూనిరేషన్లు బాలీవుడ్ హీరోల రేంజ్ కి చేరాయి. మన తెలుగు హీరోలు యాభై నుంచి అరవై కోట్లు వరకు తీసుకుంటున్నారు. మిడ్ రేంజ్ హీరోలు కూడా పది కోట్లు వసూలు చేస్తున్నారు. అయితే ఇదంతా కుర్ర బానే వర్క్ అవుట్ అవుతుంది అయితే సీనియర్ హీరోల పరిస్థితి మాత్రం కాస్త చిత్రంగా వుంది.

చాలా ఏళ్ళు గ్యాప్ తీసుకుని మళ్ళీ సినిమాల్లోకి వచ్చిన మెగాస్టార్ ది ఓ ప్రత్యేకమైన కేటగిరీ, విక్టరీ వెంకటేష్ ఎఫ్ 3 సినిమాకు కాస్త గట్టిగానే రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నారని టాక్ వుంది. నాగార్జున రెమ్యూనిరేషన్ మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంది. అయితే బాలకృష్ణ సినిమాకి ఎంత తీసుకుంటున్నారు అనేది అభిమానుల ప్రశ్న. ఇటీవల విడుదల అయిన అఖండ టీజర్ తో సంచలనాలు నమోదు చేస్తున్న  బాలయ్య రెమ్యూనిరేషన్ కేవలం ఏడు కోట్లే అని సమాచారం.

సినిమాకు బాలయ్య మినిమమ్ పది కోట్లు తీసుకుంటారని టాక్. అయితే అందరూ ఊహించుకుంటున్నట్టుగా అతను సినిమాకు పది కోట్లు తీసుకోవడం లేదని కేవలం ఏడు కోట్లు మాత్రమే వసూలు చేస్తున్నారని సమాచారం. అఖండ సినిమాకు కూడా బాలయ్య అంతే వసూలు చేస్తున్నారని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss