Monday, May 10, 2021

Latest Posts

నందమూరి మల్టీ స్టారర్ త్వరలోనే వస్తుందా?

Nandamuri Multistarrer

అనిల్ రావిపుడి కళ్యాణ్ రామ్ తో కలిసి చేసిన పటాస్ ఆయనకి దర్శకుడిగా మంచి పేరుని తెచ్చి పెట్టింది. ఈ చిత్రం విజయం రావిపుడిని పరిశ్రమలో దర్శకుడిగా స్థిరపరిచింది. అనిల్ దీన్ని మరచిపోలేదు. బహిరంగంగా చాలా సార్లు కళ్యాణ్ రామ్ పట్ల కృతజ్ఞతలు తెలిపారు. అలానే మళ్లీ వీలు దొరికితే సినిమా చేస్తామని చెప్పారు.

అయితే అనిల్ కి నందమూరి బాలకృష్ణ పట్ల గొప్ప అనుబంధం ఉంది. మొదటి నుంచి బాలయ్య అభిమాని అని చెప్పుకునే రావిపూడి బాలయ్యతో జట్టుకట్టడం తన కల అని పలుసార్లు పేర్కొన్నారు. తాజాగా బాలయ్యతో కలిసి రావిపూడి ఒక సినిమా చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ కూడా కీలక పాత్రలో నటించనున్నారు. ఇది నందమూరి మల్టీస్టారర్ గా తెరకెక్కబోతోంది.

ప్రస్తుతం అనిల్ వెంకటేష్, వరుణ్ తేజ్ లతో ఎఫ్ 3 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం పూర్తవ్వగానే ఈ సినిమా చేసే అవకాశం ఉంది. అంతే కాకుండా అనిల్ మహేశ్ తో కూడా ఒక సినిమా చేయనున్నాడు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss