Thursday, December 2, 2021

Latest Posts

అమరావతి పేరు వింటేనే జగన్ వణికిపోతున్నాడు – లోకేష్

Nara Lokesh comments farmers arrested during protest

అమరావతిలో కొనసాగుతున్నా రైతుల ఆందోళన 600వ రోజుకు చేరుకున్న తరుణంలో అమరావతి రైతులు, మహిళలు, జేఏసీ నేతలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. దాంతో వారి పోరాటంపై పోలీసులు ఆంక్షలు విదించి అడుగడుగునా రైతులు, మహిళలు, జేఏసీ నేతలను అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ అరెస్టులతో నిరసనకారులను నిర్బంధించి పోలిస్ జులుం ప్రదర్శించారు. రైతులు, మహిళలు, జేఏసీ నేతలు అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుకుంటూ మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు.  ట్విట్టర్ ద్వారా వేదికగా స్పందిస్తూ అమరావతి పేరు వింటేనే వై.ఎస్. జగన్ వణికిపోతున్నాడు. ప్రజా రాజధాని పరిరక్షణ ఉద్యమం జగన్ ప్రభుత్వం అణిచివేతకి ఎదురొడ్డి నిలిచి మహోద్యమం అయ్యింది.

జై అమరావతి పోరాటం 600 రోజులైన సందర్భంగా జేఏసీ పిలుపు మేరకు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ శాంతియుతంగా నిరసన తెలిపిన ఉద్యమకారులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు.వ్యాన్లలో కుక్కారు.సెల్ లో బంధించారు.రైతుల కాళ్లు విరగ్గొట్టారు.మహిళల పట్ల మగపోలీసులు అనుచితంగా ప్రవర్తించారు.ఉద్యమంపై ప్రభుత్వ అణచివేత బయట ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు మీడియా ప్రతినిధుల్ని నిర్బంధించారు.  ఖాకీల వలయాన్ని ఛేదించుకుని మంగళగిరి దేవస్థానం చేరుకుని జై అమరావతి అని నినదించడమే నేరంగా జైళ్లలో బందీలైన రైతులు,మహిళలు, టిడిపి నేతలు, ఉద్యమకారుల పోరాటానికి శిరసు వంచి నమస్కరిస్తున్నాను. న్యాయమైన మీ పోరాటానిదే అంతిమ విజయం. అమరావతి శాశ్వతం అంటు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss