Nara lokesh strong comments on jagan over localbody elections:
ఓపక్క స్థానిక ఎన్నికల నోటిఫికేషన్స్ రావడంతో అధికార ,విపక్షాల నడుమ విమర్శల జోరు మరింత పెరుగుతోంది. ఇప్పటికే నిత్యం అధికార వైసిపి, విపక్ష టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గు మంటుంది. తాజగా టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ప్రభుత్వ తీరుని విమర్శిస్తూ జగన్ వైరస్ సోకిందని విమర్శించారు.
అమరావతిపై జగన్ తీరుపై మరోసారి తప్పు బట్టిందని, ఆయన రాజధాని కోసం 50 మంది రైతులు ప్రాణత్యాగం చేశారని లోకేష్ పేర్కొన్నారు. 500 మంది రైతులను జైలుకు పంపారని మండిపడ్డారు. రైతుల ముసుగులో వైసీపీ కార్యకర్తలు అల్లర్లు చేయాలని కుట్ర పన్నుతున్నారని తెలిపారు. విశాఖ ప్రజలు కూడా మోసపోవద్దని ఒక్కసారి ఆలోచించాలన్నారు.
కాగా 29 గ్రామాల ప్రజల కష్టం తీర్చలేని జగన్..రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేస్తారని లోకేశ్ నిలదీశారు. ఓటమి భయంతోనే రాజధాని గ్రామాల్లో ఎన్నికలు పెట్టలేదని ఆయన ఎద్దేవా చేశారు. నాలుగేళ్లలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిని డిస్మిస్ చేస్తామని నారా లోకేష్ హెచ్చరించారు.