Nara lokesh twitte on ysrcp government over sudhkar rao suspention
ప్రపంచాన్ని వనికిస్తున కరోనా మహమ్మారి పై ముందుండి పోరాడుతున్న డాక్టర్లకు, వైద్య సిబ్బందికి మాస్కులు, వ్యక్తిగత రక్షణ ఇవ్వలేని దద్ధమ్మ ప్రభుత్వం మీది, మస్కూలు ఇవ్వండి మహాప్రభో అని అడిగిన డాక్టర్ ని సస్పెండ్ చెయ్యడం జగన్ గారి అధికార మదనికి నిదర్శనం అంటూ ట్విట్టర్ వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మస్కూలు, వ్యక్తిగత రక్షణ కిట్లు కొట్టేసి మీడియాకు ఫోజులు ఇస్తున్న వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలను ఏం చెయ్యాలి? అసలు కరోనా పెద్ద విషయం కాదు ఎన్నికలే ముఖ్యం అని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన మీకు ఏం శిక్ష వేయాలి? అని జగన్ గారిని అని నిలదీశారు. ఒక దళిత వైద్యుడిపై మీ ప్రతాపం చూపిస్తారా అంటూ విమర్శించారు.