Monday, July 26, 2021

Latest Posts

నారప్ప ప్రైమ్ విడుదల తేదీని ప్రకటించిన వెంకటేష్

Narappa Release Date In Amazon Prime

ధనుష్ తమిళ బ్లాక్ బస్టర్ డ్రామా అయిన అసురన్ యొక్క రీమేక్ నారప్పలో వెంకటేష్ దగ్గుబాటి మరియు జాతీయ అవార్డు గెలుచుకున్న నటి ప్రియమణి కలిసి నటిస్తున్నారు. ఇందులో ధనుష్ ప్రధాన పాత్ర పోషించి తన అభిమానుల మరియు సినీ ప్రేమికుల హృదయాలను గెలుచుకున్నాడు.తాజాగా వెంకటేష్, ప్రియమణి నటించిన నారప్ప జూలై 20 న అమెజాన్‌లో విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఈ శుభవార్తను వెంకటేష్ తన ట్విట్టర్‌లో వెల్లడించారు. వెంకటేష్ మాట్లాడుతూ, “నా శ్రేయోభిలాషులు మరియు అభిమానులందరూ మా చిత్రం నరప్ప చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం పట్ల మీకున్న ప్రేమ వల్ల మేము మరింత కష్టపడ్డాం నారప్ప లానే అని చెప్పాడు. ”

మరో సారి ట్వీట్ చేస్తూ, “ఈ చిత్రం ప్రేక్షకులు ఇంటి వద్దే ఉంది సురక్షితంగా చూడండి. నారప్ప కొద్ది రోజులలో ఒక క్లిక్ దూరంలో ప్రైమ్ వీడియో లో విడుదల అవుతుందని తెలిపారు.” ఈ రివెంజ్ డ్రామాను శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించగా సురేష్ బాబు మరియు కలైపులి ఎస్ తను సంయుక్తంగా నిర్మించారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss