Thursday, October 22, 2020

Latest Posts

కీలక పోరులో టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్‌

దుబాయ్‌ వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరికొది సేపట్లో కీలక పోరులో తలపడనున్నారు. ఈ రోజు జరిగే మ్యాచ్ లో  ఇరు జట్లకు ఈ విజయం అత్యంత కీలకం. ఈ సందర్భంగా...

తెలంగాణ కరోనా కేసులు

తెలంగాణ ప్రభుత్వం గత 24 గంటల్లో 1456 మందికి కరోనా పాసిటివ్ గా నిర్దారణయ్యింది. కాగా 5 మంది కరోనా సోకి చనిపోవడం జరిగింది. కాగా ఇప్పటివరకు 1292 మంది చనిపోవడం జరిగినది....

హైదరాబాద్ లో ముంపు ప్రాంతాలను పరిశీలించిన కేంద్ర బృందం

హైదరాబాద్ లో భారీ వర్షాలు కురవడంతో కొన్ని ప్రాంతాలు జలమయమైన విషయం తెలిసినదే. ఆ ముపుకు గురైన ప్రాంతాన్ని గురువారం కేంద్ర బృందం పరిశీలించింది. వరద బాధిత ప్రజలతో కేంద్ర బృందం సభ్యులు...

అధికారిక లాంఛనాలతో నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు

కార్మిక సంఘం నాయకుడిగా జీవితాన్ని ప్రారంభించిన టీఆర్‌ఎస్‌ సీనియర్ నాయకుడు, ఉద్యమ నేత నాయిని నర్సింహారెడ్డి నిన్న (బుధవారం) రాత్రి కన్నుమూశారు. ఆయన మరణం అత్యంత బాధాకరమని పలువురు రాజకీయ నాయకులు మరియు...

నారాయణా .. నారాయణా .. ఎక్కడా కనపడ్డం లేదు?

గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మున్సిపల్ మంత్రిగా పనిచేసిన నారాయణ ఇప్పుడు కనిపించడం లేదా? ఎక్కడున్నారో తెలీదా? ఇది ఎవరో అంటే పర్వాలేదు. సాక్షాత్తూ ఓ ఎమ్మెల్యే అంటున్నారు. “టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతి సీఆర్డీఏ పరిధిలో అప్పటి మంత్రి నారాయణ పని చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల కోసం మాజీ మంత్రి నారాయణ అప్రూవర్‌గా మారి వాస్తవాలు చెబితే స్వాగతిస్తామని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్‌ అన్నారు. గురువారం విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 29 గ్రామాల రైతులు ఆందోళన చేస్తున్నా నారాయణ కనిపించకపోవడంపై అనుమానాలు కలుగుతున్నాయన్నారు. అమరావతిలో అక్రమాలు నారాయణ చెప్పాలనుకుంటే చెప్పొచ్చని, చంద్రబాబు నుంచి ఎలాంటి హానీ లేకుండా రక్షణ కల్పిస్తామని ఆయన అన్నారు.

‘మాజీ మంత్రి నారాయణ కనిపించడం లేదు. ఆయన ఎక్కడ ఉన్నారో బయటకు రావాలి. అమరావతి ప్రాంత ప్రజలు ఆందోళన చేస్తున్నా ఆయన మాత్రం కనిపించడం లేదు. అసలు అమరావతిని ఇలా ఎందుకు నిర్మించారో మాజీ మంత్రి నారాయణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక చంద్రబాబు విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లో ఆందోళన చేస్తున్న సమయంలో ఆయన వెంట అనుచరులు తప్ప, రైతులెవరు మాకు కనిపించలేదు. ఒక అసాంఘిక శక్తిగా చంద్రబాబు కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల నుంచి దృష్టి మరల్చేందుకే బాబు యత్నించారు. రాష్ట్రానికి ఏదో అన్యాయం జరిగిపోతోందంటూ బాబు అండ్‌ కో బాగా నటించారు. కొనుకున్న భూములకు రేట్లు రావాలనేదే వారి తాపత్రాయం’అని అమరనాధ్ వ్యాఖ్యానించారు.

అమరావతి జేఏసీ అంటే జాయింట్‌ యాక్షన్‌ కమిటీ కాదని, జాయింట్‌ యాక్టింగ్‌ కమిటీ అని గుడివాడ అమరనాధ్ చెబుతూ, ఎందుకంటే ఆ కమిటీలో ఉన్న వారంతా యాక్టర్లే నన్నారు. ‘రాజధాని పేరుతో చంద్రబాబు ఎన్ని కోట్లు తిన్నారనేది ప్రతీ ఒక్కరికి తెలుసు. త్వరలోనే అన్ని విషయాలు బయటికి వస్తాయి. చంద్రబాబు మాట్లాడితే జైలుకి పంపండి అంటున్నాడు. ఆయనకు ఆ కోరిక త్వరలోనే తీరనుంది. తప్పు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. ‘అని ఆయన పేర్కొన్నారు. ‘ ఇక గత అయిదేళ్లలో టీడీపీ నేతలు విశాఖలో వేల ఎకరాలు దోచుకున్నారు. త్వరలో టీడీపీ నేతలు చేసిన అవినీతిని బయటపెడతాం. అమరావతిలో జరుగుతున్న ఉద్యమం కేవలం 29 గ్రామాల సమస్యే. ఇది తెలుగు ప్రజల సమస్య కాదు’ అని వ్యాఖ్యానించారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

కీలక పోరులో టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్‌

దుబాయ్‌ వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరికొది సేపట్లో కీలక పోరులో తలపడనున్నారు. ఈ రోజు జరిగే మ్యాచ్ లో  ఇరు జట్లకు ఈ విజయం అత్యంత కీలకం. ఈ సందర్భంగా...

తెలంగాణ కరోనా కేసులు

తెలంగాణ ప్రభుత్వం గత 24 గంటల్లో 1456 మందికి కరోనా పాసిటివ్ గా నిర్దారణయ్యింది. కాగా 5 మంది కరోనా సోకి చనిపోవడం జరిగింది. కాగా ఇప్పటివరకు 1292 మంది చనిపోవడం జరిగినది....

హైదరాబాద్ లో ముంపు ప్రాంతాలను పరిశీలించిన కేంద్ర బృందం

హైదరాబాద్ లో భారీ వర్షాలు కురవడంతో కొన్ని ప్రాంతాలు జలమయమైన విషయం తెలిసినదే. ఆ ముపుకు గురైన ప్రాంతాన్ని గురువారం కేంద్ర బృందం పరిశీలించింది. వరద బాధిత ప్రజలతో కేంద్ర బృందం సభ్యులు...

అధికారిక లాంఛనాలతో నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు

కార్మిక సంఘం నాయకుడిగా జీవితాన్ని ప్రారంభించిన టీఆర్‌ఎస్‌ సీనియర్ నాయకుడు, ఉద్యమ నేత నాయిని నర్సింహారెడ్డి నిన్న (బుధవారం) రాత్రి కన్నుమూశారు. ఆయన మరణం అత్యంత బాధాకరమని పలువురు రాజకీయ నాయకులు మరియు...

Don't Miss

నేత్రదానం చేసిన సీఎం

జాతీయ నేత్రదానం ఫోర్ట్‌నైట్ సందర్భంగా తన నేత్రాలను దానం చేయనున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన పేరును నమోదు చేసుకున్నారు. అలాగే నేత్రదానం చేయాలనుకుంటున్న వారిని పోత్సహించేలా,...

సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబంలో విషాదం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భార్యకు  పెదనాన్న అయిన ఈసీ పెద్ద గంగిరెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న...

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

కుషుబు కంటికి గాయం

తమిళ నటి కుషుబు కంటికి గాయం అయ్యింది అని తెలుస్తుంది. తన కంటి కింద కత్తితో ఒక గాయం అయినట్టు ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. కాగా తాను కొన్ని...

తెలంగాణలో రేపు ప్రారంభం కానున్న హరితహారం

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెట్టు ఉంటె నీడను ఇస్తుంది చెట్టుతో ఎన్నో లాభాలు ఉన్నాయి. అలాంటి చెట్లను మనం  కాపాడితే...

ప్రారంభమైన పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జ్‌

పంజాగుట్ట దగ్గర నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జ్‌ని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ పాల్గొన్నారు. కేవలం...

వైసీపీ నేత కన్నుమూత

మాజీ మంత్రి,  కడప జిల్లాకు చెందిన వైసీపీ నేత ఖలీల్ బాషా కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు తుదిశ్వాస విడిచారు....