Narendra Modi thanked our telugu heroes
కరోనా వైరస్‌తో ప్రపంచమంత అతలాకుతలం అవుతుంది. దీనిని అరికట్టాలి అంటే సామాజిక దూరం ఒకటే మార్గం. ఆ సామాజిక దూరం పాటించాలి అనే ఊదేశంతోనై మన దేశ ప్రధాని దేశమంతా లాక్ డౌన్ ప్రకటించారు. కానీ కొంతమందికి దానిపై అవగాహన లేక కేంద్రం చెప్పిన విదివిధానాలను పాటించ్డమ్ లేదు. ఈ పరిస్థితుల్లో ప్రజల్లో కరోనా వైరస్ గురించి అవగాహన కలిపించాలి అని కొంతమంది ముందుకు వచ్చారు. అందరినీ ఇళ్లకే పరిమితం కావాలంటూ సూచనలు చేస్తున్నారు.
ఈ క్రమంలో తెలుగు కథానాయకులు చిరంజీవి, నాగార్జున, వరుణ్ తేజ్, సాయి తేజ్ కలిసి కోటిగారు సంగీత సమకూర్చిన ఓ పాటకు నటిస్తూ కరోనా వైరస్ ను ఎలా ఎదుర్కోవాలో, దాన్ని ఎదుర్కోనే క్రమంలో ఎలాంటి జాగ్రతలు తీసుకోవలో ఆ పాట ద్వారా తెలిపారు. ఆ పాటను చూసిన ప్రధాని మోదీ ప్రత్యేకంగా చిరంజీవి, నాగార్జున, వరుణ్ తేజ్, సాయి తేజ్‌లను అభినందిస్తూ తెలుగులో ఈ విదంగా ట్వీట్ చేశారు. ‘‘చిరంజీవిగారికీ, నాగార్జునగారికీ, వరుణ్ తేజ్ కీ, సాయి ధరమ్ తేజ్ కీ మీరందరూ ఇచ్చిన అతి చక్కని సందేశానికి నా ధన్యవాదాలు. అందరం మన ఇళ్ళల్లోనే ఉందాం. అందరం సామాజిక దూరం పాటిద్దాం.కరోనా వైరస్ పై విజయం సాధిద్దాం’’ అని మన హీరోలకు ట్విటర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు.