Monday, July 26, 2021

Latest Posts

జాతీయ అవార్డు గ్రహీత నటుడు మృతి

National Award Winner Sanchari Vijay

జాతీయ అవార్డు గ్రహీత కన్నడ నటుడు సంచారి విజయ్(38) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సంచారి విజయ్, జూన్ 12 న, తన స్నేహితుడి వద్దకు వెళ్ళి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు అతను ప్రమాదానికి గురయ్యాడు. అతను తన మోటర్‌బైక్‌ పై వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. వెంటనే అతన్ని బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

అయితే ఆయన చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందారు. బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ కావడంతో ఆయనకు శస్త్ర చికిత్స చేశారు. కానీ అతని పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయం మాత్రం 48 గంటల వరకు చెప్పలేమని డాక్టర్లు చెప్పారు. చివరికి ఆయన ఈ రోజు కన్ను మూశారు. దీనితో అతని అవయవాలను దానం చేయాలని అతని కుటుంబం నిర్ణయించింది.

సంచారి విజయ్ 2011లో తన సినీ కెరీర్ ని ప్రారంభించాడు. నాను అవనల్ అవలు అనే సినిమాతో అతను జాతీయ అవార్డును గెలుచుకున్నాడు. అంతే కాకుండా లాక్ డౌన్ టైంలో కోవిడ్ రోగుల‌కు ఆక్సిజ‌న్ అందించాడు మరియు ప‌రిశ్ర‌మ‌లోని కార్మికుల‌కు త‌న వంతు సాయం అందించాడు.

ఇవి కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss