ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఈ మహమ్మారితో పోరాడటానికి ప్రపంచ దేశాలు లాక్ డౌన్ నే ఆయుధంగా భావిస్తున్న సమయంలో .. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాత్రం విరుద్ధ వ్యాఖ్యలు చేశారు. లాక్ డౌన్ రాజ్యాంగ విరుద్ధం అంటూ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వ చర్యలను రాష్ట్ర ప్రభుత్వం స్వాగతించడం ఏంటని ఒవైసీ ప్రశ్నించారు. ఆన్ లైన్ మీటింగ్లో పాల్గొన్న ఆయన కరోనాపై పోరాటం అంశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు పై సంచలన వ్యాఖ్యలు చేసారు.
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడం రాజ్యాంగ విరుద్ధం అన్నారు. దేశ విపత్తు నిర్వహణ చట్టం అంటువ్యాధుల నిరోధక చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించడం చట్ట విరుద్ధమే కాక సమాఖ్య విధానానికి కూడా వ్యతిరేకం అన్నారు. లాక్ డౌన్ అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం మౌనంగా ఉండటం ఆశ్చర్యంగా ఉందన్నారు ఒవైసీ. దీనివల్ల వలస కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు అని కార్మికులు ఎన్నో వ్యయ ప్రయాసాలకోర్చి స్వరాష్ట్రాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
ఇది కూడా చదవండి: ఈ ఏడాది చివరి వరకు వర్క్ ఫ్రం హోం యోచనలో బడా కంపెనీలు