Thursday, May 13, 2021

Latest Posts

ఏకగ్రీవమైన పంచాయితీలకు భారీగా నజరానా

Nazrana heavily for unanimous panchayats in andhra pradesh:

ఏపీలో పంచాయితీలు,మండల పరిషత్ లు,జిల్లా పరిషత్ లు,మున్సిపాల్టీలకు ఎన్నికలు జరపటానికి షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఒక్కసారిగా ఎన్నికల వాతావరణం వేడెక్కింది. గ్రామాల్లో అయితే నువ్వా నేనా అన్నట్లు పోటీకి సమాయత్తం అవుతున్నారు. అయితే పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల్లో సర్పంచ్‌లతోపాటు వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికైతే ఆ గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా ప్రోత్సాహకాలు అందించడానికి కసరత్తు చేస్తోంది.

unanimous panchayats

ఏకగ్రీవాలు జరిగే చోట.. గ్రామ జనాభా ఆధారంగా రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు నజరానా ఇవ్వాలన్న యోచన చేస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రతి పాదనలను పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజా శంకర్‌ ఇప్పటికే ప్రభుత్వానికి అందించారు. ఒకటి, రెండు రోజుల్లో దీనికి సంబంధించిన దీనికి సంబంధిఞ్చసిన జీవో వెలువడే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. గ్రామ పంచాయతీల ఎన్నికలు రాజకీయ పార్టీల గుర్తులతో సంబంధం లేకుండా పార్టీ రహితంగా జరుగుతాయి కనుక గ్రామ పంచాయతీ ఎన్నికలకు మాత్రమే ప్రభుత్వం ఈ ప్రోత్సాహకాలను అందజేస్తోంది.

vijaysaireddy_1

గ్రామాలూ అభివృద్ధి చెందాలంటే, గ్రామ ప్రజలందరూ కలిసికట్టుగా ఉండి గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. గ్రామాలకు ఏడాది కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వివిధ గ్రాంట్లు అందు తున్నాయి. వీటితోపాటు పంచా యతీలు స్థానికంగా పన్నుల రూపంలో వసూలు చేసుకునే మొత్తానికి సమానంగా ఏకగ్రీవ మయ్యే గ్రామాలకు ప్రభుత్వం నిధులు అందజేసే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి ఎన్ని పంచాయితీలు ఈ ఛాన్స్ అందిపుచ్చుకుంటాయో చూడాలి.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss