విశాఖ సంఘటన స్థలానికి ఎన్డిఆర్ఎఫ్ బృందాలు వచ్చి వారి సేవలను ప్రారంభించడం జరిగింది. కాగా రెండవ సారి కూడా గ్యాస్ లీక్ అయ్యిందన్న వార్తలు విశాఖలో గుప్పుమంటున్నాయి, కాగా అవన్నీ వట్టి పుకార్లు అని, నిన్న రాత్రి గ్యాస్ లీక్ పూర్తిగా అదుపులోకి వచ్చిందని ఆ కంపెనీ ఇచ్చిన తాజా ప్రకటన ద్వారా తెలుస్తుంది. కాగా అక్కడ ప్రస్తుతం అర కిలోమీటర్ పరిధి వరకు కంటైన్మెంట్ జోన్లు ప్రకటించడం జరిగింది.
ఎవరిని ఈ పరిసర ప్రాంతాలలోకి అనుమతించడం లేదు. ఏపిఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది ప్రస్తుతం పహారా కాస్తూ ఎవ్వరిని ప్రవేశించకుండా కట్టు దిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఏపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన్ సిఎస్ఓ కమిటీ నిర్ణయం ప్రకారం, గుజరాత్ మరియు నాగపూర్ నుంచి ప్రత్యేక బృందాలను ఇక్కడ కప్పి ఉన్న విష వాయువును న్యూట్రలైస్ చెయ్యడానికి రానున్నట్టు తెలుస్తుంది. తాజాగా ఎన్డిఆర్ఎఫ్ బృందాలు కూడా తమ విధులను నిర్వహిస్తున్నాయి.