Sunday, June 20, 2021

Latest Posts

నెక్లెస్ రోడ్డుకు మాజీ ప్రధాని పేరు

Necklace Road Hyderabad To Be Renamed

నెక్లెస్ రోడ్డుకు మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు పేరును పెట్టాలని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. పివి నరసింహారావు 100వ సంవత్సర వేడుకలు సమీపిస్తున్న వేల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హుస్సేన్‌సాగర్ ఒడ్డున ఉన్న 5.5 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న నెక్లెస్ రహదారికి ఇప్పుడు పివి నరసింహారావు మార్గ్ అని పేరు పెట్టనున్నారు.

పివి నరసింహారావు శతాబ్ది ఉత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం రూ .10 కోట్లు కేటాయించింది. ఈ వేడుకలు జూన్ 28న ముగియనున్నాయి. ఇక నెక్లెస్ రోడ్ చరిత్రలోకి వెళితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కోట్ల విజయభస్కర్ రెడ్డి ప్రారంభించారు. నెక్లెస్ రోడ్ ప్రాజెక్టును 1982 లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. అయితే ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసి, హుస్సేన్‌సాగర్‌లో బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది మాత్రం తెలుగు దేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు.

ఇక కె.సి.ఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ కూడా పివి నరసింహారావు గారి ఆర్థిక సంస్కరణల గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇలా పేరు పెట్టి తమకు పి‌వి నరసింహా రావు అంటే ఉన్న గౌరవం చూపించనుండి కే‌సి‌ఆర్ ప్రభుత్వం. ఇటీవల జరిగిన ఎంఎల్‌సి ఎన్నికలలో పివి కుమార్తె సురభి వాణి దేవికి ప్రభుత్వం ఎంఎల్‌సి టికెట్ కూడా ఇచ్చింది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss