Wednesday, September 23, 2020

Latest Posts

రాయగిరి రైల్వే స్టేషన్ పేరును యాదాద్రి గా మార్పు

తెలంగాణలో గల రాయగిరి రైల్వే స్టేషన్ ను యాదాద్రి గా మార్పు చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే. కాగా దీనికి సంబందించి ప్రెస్ రిలీజ్ కూడా చేయడం జరిగినది. కాగా తెలంగాణలో యాదాద్రి...

కరోనతో ప్రముఖ తమిళ నటుడు మృతి

ఈ కరోన మహమ్మారి ఎవర్నీ వదలడం లేదు. ఇప్పటికే ఇండస్ట్రీలో కూడా చాలా మంది కోవిడ్-19 బారిన పడి చనిపోయారు. కొందరు కోలుకున్నారు కూడా. అయితే తమిళ ఇండస్ట్రీలో మాత్రం వరస విషాదాలు...

‘గూగుల్ పే’ వినియోగదారులకు గుడ్ న్యూస్

గూగుల్ పే యాప్ నుంచి కొత్త సర్వీసులు అందుబాటులోకొచ్చాయి. బ్యాంక్ ఖాతాదారులు తమ క్రెడిట్, డెబిట్ కార్డులను ఈ యాప్‌లో జత చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఎస్‌బీఐ ఖాతాదారులకు చెల్లింపులు మరింత సులభమయ్యాయి....

అక్కినేని-వంశీ జాతీయ వైద్యరత్న పురస్కారాల ప్రదానోత్సవం

నట సామ్రాట్‌ అక్కినేని 97వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని అక్కినేని-వంశీ జాతీయ, వైద్యరత్న పురస్కారాల ప్రదానోత్సవం నేడు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వర్ణయుగ సినీనటి తోట రాజశ్రీకి అక్కినేని- వంశీ జాతీయ...

నీలం సంజీవరెడ్డి జయంతి

నీలం సంజీవరెడ్డి నిజాయితీకి మారుపేరు. గొప్ప కార్యదక్షుడు. జనరంజకమైన ఉపన్యాసకుడు కూడా. సామాన్యుల భాషలో మాట్లాడి వారిని మెప్పించగల వక్త. ఆంధ్రప్రదేశ్‌లో రెండుసార్లు ముఖ్యమంత్రి పదవినలంకరించిన అతి కొద్దిమందిలో ఆయన మొదటివారు.

నిక్కమైన మంచి నీలమొక్కటిచాలు తళుకు బెళుకురాలు తట్టెడేల అన్నారు. అటువంటి అరుదయిన దేశనాయకుల్లో డాక్టర్‌ నీలం సంజీవరెడ్డి ఒకరు. ఉక్కు మనిషిగా నిరూపించుకున్న ఆయన రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నికై తెలుగు జాతికి ఎనలేని కీర్తిప్రతిష్ఠల్ని…  సంపాదించి పెట్టారు.  అసలు రాజకీయాల్లో తెలుగు వారనగానే రాష్ట్రపతులు, గవర్నర్లు గుర్తొస్తారు. తెలుగువాళ్లు చెప్పుకోదగిన సంఖ్యలో ఈ పదవులకు ఎన్నికయ్యారు. వారందరిలోనూ నీలం సంజీవరెడ్డి స్థానం ప్రత్యేకమైంది. ఆయన ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి,  కేంద్రమంత్రి, లోక్‌సభ సభాపతి, రాష్ట్రపతి పదవులను అలంకరించారు. ఏ పదవి చేపట్టినా ఆపదవికే వన్నె తెచ్చిన ఖ్యాతి ఆయనది. ఏ పదవికోసమూ ఆయన పాకులాడలేదు. అవే ఆయన్ను వరించాయి. చిత్రమేమిటంటే రాష్ట్రపతి పదవితప్ప ఏ పదవిలోనూ ఆయన పూర్తికాలం ఉండలేదు.

భారతదేశ హృదయాల్లో పరి పాలనాదక్షుడిగా మహోన్నత స్థానాన్ని పొందిన వారిలో పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ, లాల్‌బహదూర్‌శాస్త్రి, రాజగోపాలాచారి, ఇందిరాగాంధీ, కామరాజ్‌ నాడార్‌ ముఖ్యులు. కాగా ఆంధ్రప్రదేశ్‌ తొలి ముఖ్యమంత్రిగా, అఖిల భారత జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా, కేంద్రమంత్రిగా, లోక్‌సభ స్పీకర్‌గా, రాష్ట్రపతిగా అనేక పదవులు అలంకరించి తన పరిపాలనా చాకచక్యంతో ఆ పదవులకే వన్నె తెచ్చిన పరిపాలనాదక్షుడు నీలం సంజీవరెడ్డి. సామాన్య రైతుబిడ్డగా జన్మించి, దేశంలో అత్యున్నతమైన భారత రాష్ట్రపతి పదవిని అలంకరించిన నీలం 107వ జయంతి నేడు.

అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ఇల్లూరు గ్రామంలో 1913 మే 19న సాధారణ రైతు కుటుంబంలో సంజీవరెడ్డి జన్మించారు. మద్రాసు దివ్యజ్ఞాన సమాజం పాఠశాలలో, అనంతపురం ఆర్ట్స్‌ కళాశాలో చదివారు. 1935 జూన్‌ 8న నాగరత్నమ్మను వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. నీలం రాజకీయ జీవితంలో ఎన్నో విజయాలు, అపజయాలతో పాటు రాజకీయ ఎత్తుగడలతో కూడిన త్యాగాలున్నాయి. 1940-70 వరకు రాష్ట్ర, దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన ప్రతి ముఖ్య ఘటనలోనూ ఆయన ప్రమేయం ఉందనే చెప్పాలి.

1929లో మహాత్మాగాంధీ స్ఫూర్తితో చదువును పక్కనపెట్టి స్వాతంత్య్ర పోరాటం వైపు దృష్టి సారించారు. 1937లో ఆంధ్ర ప్రాంతీయ కాంగ్రెస్‌ కమిటీకి కార్యదర్శిగా ఎన్నికై దాదాపు పదేళ్లపాటు పదవిలో కొనసాగారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లారు. 1946లో మద్రాసు శాసనసభకు, 1947లో రాజ్యాంగ సభకు ఎన్నికయ్యారు. 1949-51 వరకు మద్రాసు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 1951లో ఆంధ్రప్రాంత కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు ఆ పదవికి రాజీనామా చేశారు. ఆ కాలంలోనే ఆయన ఐదేళ్ల కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఆ విషాదాన్ని తట్టుకోలేని సంజీవరెడ్డి పార్టీ పదవికి రాజీనామా చేశారు. తరువాత పార్టీ పెద్దల ఒత్తిడి మేరకు రాజీనామాను ఉపసంహరించుకున్నారు.

అంతేకాదు 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పుడు కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నాయకుడిగా పోటీ లేకుండా ఎన్నికయ్యారు. సీఎం పదవి ఖాయమైనా టంగుటూరి ప్రకాశం పంతులుకు నాయకత్వం అప్పగించి ఉప ముఖ్యమంత్రిగా కొనసాగారు. 1955లోనూ మరోసారి సీఎం పదవి వదులుకున్నారు. అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎన్‌జీ రంగా నాయకత్వంలోని కృషికార్‌ లోక్‌పార్టీ మద్దతు కాంగ్రేస్ కు అవసరమైంది. బెజవాడ గోపాల్‌రెడ్డి సీఎం అయితే మద్దతిస్తామని రంగా ప్రకటించడంతో మళ్లీ ఉప ముఖ్యమంత్రి పదవికే పరిమితమయ్యారు. 1967లో లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన వెంటనే నిష్పాక్షికతతో ఉండాలనే ఉద్దేశంతో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి నీలం చరిత్ర సృష్టించారు. 1969లో స్పీకర్‌ పదవికి రాజీనామా చేసి రాష్ట్రపతి పదవికి పోటీ చేశారు. మరో తెలుగు నేత వీవీ గిరి చేతిలో స్వల్పతేడాతో ఓడిపోయారు.

1977లో ఎమర్జెన్సీ తరువాత జరిగిన ఎన్నికల్లో ఏపీలో 42 స్థానాలకు గాను 41సీట్లు కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. జనతా పార్టీ తరఫున సంజీవరెడ్డి ఒక్కరే విజయం సాధించి మరోసారి లోక్‌సభ సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మళ్లీ ఆ పదవికి రాజీనామా చేసి నాలుగు నెలల్లోనే రాష్ట్రపతి పదవికి పోటీ చేశారు. పోటీలో ఉన్న 37మంది అభ్యర్థుల్లో సంజీవరెడ్డి నామినేషన్‌ చెల్లగా మిగిలినవన్నీ తిరస్కరించారు. దీంతో ఆయన రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటి వరకూ ఏకగ్రీవంగా ఎన్నికైన భారత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ఒక్కరే కావడం విశేషం. 1982లో రాష్ట్రపతి పదవి నుంచి దిగిపోయాక రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుని బెంగళూరులో స్థిరపడ్డారు. నిజాయితీకి నిలువుటద్దంగా, నిరాడంబరుడిగా పేరుపొందిన నీలం సంజీవరెడ్డి 1996 జూన్‌ 1న కన్నుమూశారు.

ఇది కూడా చదవండి: గాంధీతో పాటు నేను పుడతా | నాథూరాం గాడ్సే

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

రాయగిరి రైల్వే స్టేషన్ పేరును యాదాద్రి గా మార్పు

తెలంగాణలో గల రాయగిరి రైల్వే స్టేషన్ ను యాదాద్రి గా మార్పు చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే. కాగా దీనికి సంబందించి ప్రెస్ రిలీజ్ కూడా చేయడం జరిగినది. కాగా తెలంగాణలో యాదాద్రి...

కరోనతో ప్రముఖ తమిళ నటుడు మృతి

ఈ కరోన మహమ్మారి ఎవర్నీ వదలడం లేదు. ఇప్పటికే ఇండస్ట్రీలో కూడా చాలా మంది కోవిడ్-19 బారిన పడి చనిపోయారు. కొందరు కోలుకున్నారు కూడా. అయితే తమిళ ఇండస్ట్రీలో మాత్రం వరస విషాదాలు...

‘గూగుల్ పే’ వినియోగదారులకు గుడ్ న్యూస్

గూగుల్ పే యాప్ నుంచి కొత్త సర్వీసులు అందుబాటులోకొచ్చాయి. బ్యాంక్ ఖాతాదారులు తమ క్రెడిట్, డెబిట్ కార్డులను ఈ యాప్‌లో జత చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఎస్‌బీఐ ఖాతాదారులకు చెల్లింపులు మరింత సులభమయ్యాయి....

అక్కినేని-వంశీ జాతీయ వైద్యరత్న పురస్కారాల ప్రదానోత్సవం

నట సామ్రాట్‌ అక్కినేని 97వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని అక్కినేని-వంశీ జాతీయ, వైద్యరత్న పురస్కారాల ప్రదానోత్సవం నేడు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వర్ణయుగ సినీనటి తోట రాజశ్రీకి అక్కినేని- వంశీ జాతీయ...

Don't Miss

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

షీ మొబైల్‌ టాయిలెట్స్‌ను ప్రారంబించిన ఎమ్మెల్యే

బుధవారం పాలమూరులోని తెలంగాణ చౌరస్తాలో మహిళల కోసం ప్రత్యేకంగా షీ మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేశామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ఈ...

తెలంగాణలో తాత్కాలికంగా రిజిస్ట్రేషన్స్ నిలిపివేత

తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మంగళవారం నుంచి రాష్ట్రంలోని అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని, తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ‘రిజిస్ట్రేషన్‌ హాలిడే’ అమల్లో...

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

టిక్ టాక్ కోసం మైక్రో సాఫ్ట్ మరియు ట్విటర్ మద్య పోటీ

టిక్ టాక్... ప్రపంచవ్యాప్తంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న ఈ యాప్ ఇప్పుడు వార్తల్లో నిలుస్తుంది. టిక్ టాక్ పేరెంట్ కంపెనీ అయిన బైట్ డాన్స్ నుంచి విడిపోయి మొదట చూసినా ఇప్పుడు బైట్...

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

ఈ నెల17 నుంచి వీసా ప్రక్రియ ప్రారంభం

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థుల యూఎస్‌ వీసా ప్రక్రియ ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని...