Wednesday, December 1, 2021

Latest Posts

నీరజ్ చోప్రా బయోపిక్ పై స్పందన

Neeraj Chopra Responds On Biopic

టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన భారత హీరో నీరజ్ చోప్రా సోమవారం సాయంత్రం దేశానికి తిరిగి వచ్చాడు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో నీరజ్‌కు ఘనస్వాగతం లభించింది, తర్వాత కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్ మరియు కిరణ్ రిజిజు అతనికి సత్కారం చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు.

ఈ ప్రెస్ మీట్ లో దేశం కోసం గెలవడం ఎంతో గర్వంగా ఉందని చెప్పాడు. అయితే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న బయోపిక్ రిపోర్టుల పై స్పందించాడు నీరజ్. నా బయోపిక్ పై ఇప్పుడు చర్చ అనవసరం అని తెలిపాడు. నా వయసు కేవలం 23 సంవత్సరాలు మరియు నేను ఇంకా చాలా సాధించాలి. నా తదుపరి దృష్టి ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ గెలవడం పై ఉంది. ఆ తర్వాత నేను అన్నీ సాధించాను అనుకుంటే అప్పుడు రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తాను. రిటైర్మెంట్ తర్వాత కావాలనుకుంటే నా పై బయోపిక్ తీయవచ్చు అని, అప్పుడు చాలా కథలు మీకు చెప్పడానికి సిద్ధంగా ఉంటాయి అని నీరజ్ చెప్పాడు.

ఇది కూడా చదవండి:   

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss