Sunday, June 20, 2021

Latest Posts

నెల్లూరు ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ ముగ్గురు మృతి

Nellore Factory Gas Leak
నెల్లూరు జిల్లాలో మంగళవారం ఘోరం సంభవించింది. వింజమూరు మండలం చండ్రపడియాలో కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకయ్యింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ముగ్గురు కూడా అక్కడ పని చేసే కార్మికులుగా తెలుస్తుంది. ఒకరి పరిస్థితి విషమంగా కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అతనిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ప్రమాదం సంభవించడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వెంకట నారాయణ యాక్టివ్ ఇంగ్రియడెంట్స్ ఫ్యాక్టరీ‌లో రియాక్టర్‌లోకి వెళ్లే గ్యాస్ పైప్ నుంచి ఒక్కసారిగా లీక్ కావడంతో అందులో పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు అందులో చిక్కుకుపోయి మృతి చెందారు.

గ్యాస్ లీక్ అవడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు అప్రమత్తమై వెంటనే బయటకు పరుగులు తీశారు, అయితే నలుగురు మాత్రం అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా ,మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో అతనిని వెంటనే స్థానిక హాస్పిటల్‌కు తరలించారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss