Home సినిమా వార్తలు బాలీవుడ్‌ నటి పై  భగ్గు మంటున్న నెటిజన్లు 

బాలీవుడ్‌ నటి పై  భగ్గు మంటున్న నెటిజన్లు 

Neha dhupia

Netizens booing over Bollywood actress Neha dhupia:

టివి షోస్ లలో వచ్చే కార్యక్రమాలు వీక్షించే నెటిజన్లు తమ రేంజ్ లో వాటిపై కామెంట్స్ పెట్టడమే కాదు,ట్రోల్స్ చేయడం,మండిపడడం చేస్తుంటారు. ఇందులో ఎవరికీ మినహాయింపు ఉండదు. తాజాగా  బాలీవుడ్‌ నటి నేహా ధూపియాపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. ఓ షోలో తను చేసిన వ్యాఖ్యలకుగాను సోషల్‌ మీడియాలో ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.  యువతే లక్ష్యంగా ఓ ఛానల్‌ ‘రోడీస్‌ రెవల్యూషన్‌’ అనే రియాలిటి షోను నిర్వహిస్తోంది. ఈ షోలో మొత్తం అయిదుగురు గ్యాంగ్‌ లీడర్లలో ఒకరైన నేహా ధుపియా.. యువ గ్యాంగ్‌కు లీడర్‌గా ఉంటోంది. ఈ  షోలో నేహాతో పాటు రణ్విజయ్‌ సింఘా, ప్రిన్స్‌ నరులా, రాఫ్తార్‌తో పాటు నిఖిల్‌లు లీడర్లుగా వ్యవహరిస్తున్నారు.

ఇక  గత నెలలో ప్రారంభమై న ఈ షోకు సంబంధించిన ప్రోమోను సంబంధిత ఛానల్‌ గురువారం విడుదల చేసింది. ఈ ప్రోమోలో ఓ యువకుడు తనను మోసం చేసిన తన గర్ల్‌ఫ్రెండ్‌ను చెంపదెబ్బ కొట్టినట్లు వెల్లడించాడు. తనతో ప్రేమలో ఉన్న సమయంలో ఒకేసారి మరో అయిదుగురు అబ్బాయిలతో సంబంధం పెట్టుకుందని.. అందుకే తనని చెంపదెబ్బ కొట్టానని చెప్పాడు.  నేహా దీనిపై స్పందిస్తూ, ‘‘నువ్వు అలా చేయడం సరైనది కాదు. అమ్మాయి అయిదుగురు అబ్బాయిలతో కలిసి ఉండటం అనేది తన ఇష్టానికి సంబంధించిన విషయం’’ అంటూ సదరు యువకుడిపై విరుచుకు పడింది.

నేహా ఇలా  వ్యాఖ్యానించడంపై నెటిజన్లు సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు.  తనపై మీమ్స్‌ క్రియేట్‌ చేస్తూ.. ఆమె ‘ఫేక్‌ ఫెమినిస్ట్‌’ అని ట్విటర్‌లో షేర్‌ చేస్తున్నారు. అదే విధంగా.. ‘నేహా అదే తప్పునకు అయిదుగురు అబ్బాయిలను కొట్టినప్పుడు ఒకలా రియాక్ట్‌ అవుతారు… అదే తప్పు చేసిన ఒక అమ్మాయిని కొట్టినప్పుడు మరోలా స్పందిస్తూ.. లింగ భేదం చూపిస్తున్నారు’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. అంతేగాక తను మాటలను అదుపులో పెట్టుకోకపోతే విపరీతమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

Exit mobile version