లాక్ డౌన్ తో తీవ్ర ఇబ్బదులు ఎదుర్కొంటున్న నిరు పేదలకు ఒకవైపు టీమిండియా క్రికెటర్ మహమ్మద్ షమీ తన వంతుగా సాయం చేస్తుంటే మరోవైపు అతని భార్య హసీన్ జహాన్ మాత్రం సోషల్ మీడియా వేదికగా మరోసారి షమీపై ఆరోపణలు గుప్పించింది. అలాగే షమీతో కలిసి అర్ధనగ్నంగా దిగిన ఓ ఫొటోను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది.
హసీన్ ‘‘నీకేం లేనప్పుడు నన్ను ఆరాధించావు మరి ఇప్పుడు నీకు అన్నీ ఉన్నాయి కదా అందుకే నేనే మలినం అయిపోయా. అబద్దం మాటున దాగిన నిజం ఎప్పటికైనా బయటికి వస్తుంది’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక ఈ సెన్సేషనల్ పోస్టు చూసిన నెటిజన్లు ఆమెపై తీవ్రంగా మండిపడుతున్నారు. అతని కెరీర్ను మరింతగా దెబ్బతీసేందుకు ఇలాంటి నాటకాలు అడుతున్నావా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. మేము ఎప్పటికీ షమీకే మద్దతు ఇస్తామంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి