Monday, May 10, 2021

Latest Posts

‘జాతి రత్నాలు’లో ఏముంది అంటున్న నెటిజన్లు

Netizens Troll Jathi Ratnalu Movie

చిన్న హీరోలతో, చిన్న చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘జాతిరత్నాలు’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద  పెద్ద విజయాన్నే సాధించింది. నిర్మాతలకు కాసుల పంట కురిపించింది. కోవిడ్ తర్వాత ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న చిత్రాల్లో జాతిరత్నాలు సినిమా ఒక్కటి. కరోనా భయంతో బిక్కుబిక్కుమంటున్న ప్రజలను థియేటర్ కి రప్పించిన చిత్రం ఇది.

అయితే థియేటర్ కి వెళ్లని అభిమానులు ఓటీటీలో ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన ‘జాతిరత్నాలు’ చిత్రం ఏప్రిల్ 11న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. అయితే తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్‌సీస్‌లోనూ దుమ్ము లేపిన ఈ సినిమా.. ఓటీటీలోలో మాత్రం బోల్తా కొట్టింది. థియేటర్ అభిమానులకు విపరీతంగా నచ్చిన ఈ సినిమా జనానికి ఓటీటికు వచ్చేసరికి నచ్చటం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా చూశాక ఇందులో ఏముందని ఇంతగా ఆడిందని ఆశ్చర్యపోతూ కామెంట్లు పెడుతున్నారు. చిత్రంలో ‘కంటేంటే లేదు, ఓవర్‌ రేటెడ్‌ కామెడీ తప్పా’ అని పెదవి విరుస్తున్నారు ఓటీటీ ప్రేక్షకులు.

ఏది ఏమైనప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన ఈ సినిమా టోటల్ రన్ లో 70 కోట్ల వరకు సాధించింది. దీనిని అనుదీప్ దర్శకత్వం వహించారు.

ఇవి కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss