Netizens trolling pooja hegde and keerthi suresh on the aid of Corona
ప్రపంచం మొత్తం అట్టుడికిపోతోన్న కరోనా మహమ్మారితో చాలాదేశాల్లో లాక్ డౌన్ అవుతోంది. మనదేశంలో లాక్ డౌన్ అమలులో ఉంది. ఫలితంగా ఉపాధి కోల్పోయిన ఎంతో మందిని ఆదుకోవాలన్న ఉద్దేశ్యంతో పలు కార్పొరేట్ సంస్థలు, సెలబ్రిటీలు పలు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ లకు విరాళాలు అందిస్తున్నారు. మరికొందరు ఫిలిం సెలబ్రిటీలు సినీరంగానికి తమ వంతు సహాయం అందించేందుకు కరోనా క్రైసిస్ ఛారిటీ మనకోసం పేరిట మెగాస్టార్ చిరంజీవి సారధ్యంలో సంస్థ ఏర్పడడం, స్టార్ హీరోల దగ్గర నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల వరకు టెక్నీషియన్లు, ఇతరులు కూడా తమ వంతు సహాయం అందిస్తున్నారు.
అయితే ఈ సమయంలో ఒకరిద్దరు హీరోయిన్ లు తప్ప మిగతా హీరోయిన్లు తమకేమీ పట్టనట్టు ఊరుకోవడం విమర్శలకు దారితీస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్లుగా చలామణి అవుతున్న రష్మిక మందన్న, పూజా హెగ్డే, కీర్తి సురేష్ లాంటి వారు ఇంతవరకూ విరాళాలు ఇవ్వకపోవడంతో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. రష్మిక దాదాపుగా 500 కోట్ల రూపాయల ఆస్తి ఉందట. అంతేకాదు ఒక్కో సినిమాకు దాదాపు కోటి రూపాయలు పారితోషికం అందుకుంటుంది. అయినా ఒక్క పైసా కూడా విరాళం ఇవ్వకపోవడం పై నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. ఇక పూజ హెగ్డే కూడా మంచి బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చింది. డబ్బుకు లేకున్నా, రెమ్యూనరేషన్ రష్మిక కంటే ఎక్కువయినా ఇంతవరకూ ఒక్క పైసా కూడా ఇవ్వలేదు.
ఇక మహానటి సావిత్రి పాత్ర పోషించిన కీర్తి సురేష్ కూడా స్ట్రాంగ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చింది. ఇంతవరకూ ఎటువంటి సాయం ప్రకటించలేదు. ఈ హీరోయిన్లందరూ ఇంటర్వ్యూలలో తమకు సావిత్రిగారు ఆదర్శం అంటూ కవరింగ్ లు ఇస్తారే గానీ, వాస్తవం మాత్రం వేరేగా ఉంది. సావిత్రి జనరేషన్ లో కానివ్వండి సౌందర్య జనరేషన్ లో కానివ్వండి. హీరోయిన్లు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తమవంతు సాయం చేయడంలో ఎప్పుడూ ముందుండే వారు. కానీ ఇప్పటి హీరోయిన్స్ గొప్పలు తప్ప పైసా కూడా ఇచ్చే బాపతు కాదని నెటిజన్స్ ట్రోల్స్ వేస్తున్నారు