Sunday, June 13, 2021

Latest Posts

ధారావీలో దుమారం

New COVID-19 cases at Dharavi in mumbai

ధారావీ ముంబై లో అతిపెద్ద మురికివాడ.  కరోనా ప్రతాపం ఇక్కడ కూడా మొదలు పేట్టడంతో, అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ ప్రజల మద్య సామాజిక దూరం పాటించాలి అంటే చాలా కష్టతరం. ఒకొక్క ఇంట్లో కనీసం ఐదు మందికి తక్కువ ఉండరు. దానికి తోడు ధారావీకి చెందిన 50 మంది ఢిల్లీ తబ్లిగ్ జమాత్ సమావేశానికి వెళ్లి వచ్చారు. దీనికి తోడు శుక్రవారం కొత్తగా మరో ఐదుగురికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఒక్క ధారావీలోనే కరోనా కేసుల సంఖ్య 22కు చేరుకోవడంతో అప్రమత్తమైన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్. కానీ నిన్న 70 ఏళ్ల వయసుగల ఓ మహిళ కరోనాతో ఇక్కడ మరణించారు.ఆవిడ కల్యాణ్ వాడీ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ మద్యనే  ఆమె  భర్త మరణించారు దాంతో ఆమెను పరామర్శించేందుకు చాలామంది ఇంటికి వచ్చారు.

ఈ సంఘటన జరిగిన తర్వాత ఆమెకు కరోనా రావడంతో ఆమెను కేఈఎం ఆసుపత్రిలో చేర్చారు. నిన్న చేకిత్స పొందుతూ ఆవిడ మరణించింది. ఆవిడతో పాటు సన్నిహితంగా ఉన్న తండ్రి, కుమారుడికి కూడా కరోనా సోకినట్లు అదికారులు తెలిపారు. దీంతో వారిని రాజీవ్ గాంధీ జిల్లా స్పోర్ట్సు కాంపెక్స్ లో క్వారంటైన్ లో ఉంచారు. ముంబై అగ్నిమాపకశాఖ అధికారులు ధారావీ ప్రాంతాన్ని శానిటైజ్ చేస్తున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss